ఇక థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా ఈసినిమా రికార్డ్ లు తిరగరాస్తోంది. రీసెంట్ గా నెట్ ప్లిక్స్ లోకి రిలీజ్ అయిన పుష్ప2 మూవీ.. 18 గంటలకే టాప్ 1 లోకి వచ్చింది. ప్రపంచంలో ఏసినిమా అయినా ఓటీటీలో టాప్ 10 లోకి రావాలి అంటే కనీసం రెండు రోజులైనా పడుతుంది. కాని ఈమూవీ చాలా తక్కువ టైమ్ లోనే టాప్ 1 లోకివచ్చేసింది. కేవలం ఇండియా లో మాత్రమే కాదు, పాకిస్థాన్, బాంగ్లాదేశ్, బెహ్రెయిన్, మాల్దీవ్స్, ఒమెన్, శ్రీలంక, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, కెన్యా, యునైటెడ్ కింగ్డమ్, ఇలా మరిన్ని దేశాల్లో ఈసినిమాకు భయంకరమైన రెస్పాన్స్ వచ్చేస్తోంది.
Also Read: రజినీకాంత్ సల్మాన్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ, డైరెక్టర్ ఎవరో తెలుసా?