Sarath Babu: రమాప్రభతో విడాకుల తర్వాత శరత్ బాబు వెంటపడిన నటి ఎవరు? ఇద్దరూ పిల్లలను కనాలనుకున్నారా? ఆయనను 'బావా' అని పిలిచే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు? పెళ్లి చేసుకోవాలనుకుని ఎందుకు ఆగిపోయారు? శరత్ బాబు గురించి ఆమె వెల్లడించిన నిజాలేంటి?
సీనియర్ నటీనటులైన రమాప్రభ, శరత్ బాబు వివాహం చేసుకున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. చాలా కాలం కలిసి ఉన్న వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత శరత్ బాబుపై రమాప్రభ తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తులు పోవడానికి ఆయనే కారణమని, తన దగ్గర ఉన్నదంతా దోచుకున్నాడని ఆరోపించారు. శరత్ బాబు మాత్రం విడాకుల తర్వాత తన వ్యక్తిగత జీవితాన్ని చూసుకుంటూ, చివరివరకు హ్యాపీగా సినిమాలు చేస్తూ కెరీర్‌ను, లైఫ్‌ను ఎంజాయ్ చేశారు. అయితే వీరి విడాకుల తర్వాత ఓ క్యారెక్టర్ నటి శరత్ బాబుతో కలిసి బిడ్డను కనాలని భావించారట. ఆవిడ ఎవరో కాదు.. సీనియర్ నటి జయలలిత.
25
శరత్ బాబుతో బంధం... జయలలిత షాకింగ్ కామెంట్స్
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటీమణుల్లో జయలలిత ఒకరు. వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన, గ్లామరస్, క్యారెక్టర్ రోల్స్‌తో అలరించిన ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకులను, కష్టాలను ఎదుర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో అత్యంత ఆత్మీయుడైన దివంగత వర్సటైల్ యాక్టర్ శరత్ బాబుతో తనకున్న అనుబంధం గురించి ఆమె అనేక విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పని నిజాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
మాది కేవలం 'మనసు బంధం'
జయలలిత మాట్లాడుతూ.. శరత్ బాబుతో తనకున్న బంధం సాధారణ ప్రేమ లేదా ఆకర్షణ కంటే చాలా స్వచ్ఛమైనదని, అది ఒక ఆధ్యాత్మికమైన "మనసు బంధం" అని అన్నారు. "శరత్ బాబు గారు నాకు కేవలం ప్రేమికుడు లేదా స్నేహితుడు మాత్రమే కాదు, నా జీవితానికి భగవంతుడు ప్రసాదించిన ఒక గొప్ప మార్గదర్శి" అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో గడిపిన ప్రతీ క్షణం ఎంతో ప్రశాంతంగా, జ్ఞానవంతంగా ఉండేదని చెప్పారు.
35
ఆధ్యాత్మిక ప్రయాణం – మొదలైందిలా..
శరత్ బాబుకి దైవచింతన ఎక్కువ. ఆయన నిరంతరం పూజలు, తీర్థయాత్రలు చేస్తూ ఉండేవారు. జయలలిత ఆయనను 'బావా' అని ముద్దుగా పిలిచేవారు. ఆ సమయంలో ఆమె ఆయనతో మాట్లాడుతూ – "బావా! నేను ఒక ఆడదాన్ని అనే అభ్యంతరం లేకపోతే, మీరు వెళ్లే యాత్రలకు నన్ను కూడా తీసుకెళ్లండి" అని కోరారట. దానికి ఆయన సంతోషంగా అంగీకరించడంతో వారిద్దరి ఉమ్మడి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. ఆయనతో కలిసి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించానని జయలలిత గుర్తు చేసుకున్నారు. "ఆయన పక్కన కూర్చుంటే అసలు సమయమే తెలిసేది కాదు, ఆయన ఒక 'అయ్యప్ప స్వామి' లాంటి పవిత్రమైన వ్యక్తి" అని కొనియాడారు.
వీరిద్దరి మధ్య బంధం ఎంత గాఢమైనదంటే, శరత్ బాబుతో కలిసి ఒక బిడ్డను కనాలని, ఆయనతో జీవితాన్ని పంచుకోవాలని జయలలిత భావించారట. ఈ విషయాన్ని జయలలిత స్వయంగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే శరత్ బాబు ఏ విషయాన్నైనా చాలా లోతుగా, భవిష్యత్తును ఆలోచించే వ్యక్తి కావడం వల్ల – "మనం ఇద్దరం ఒక బిడ్డను కని, ఆ తర్వాత మనం చనిపోతే.. ఆస్తి కోసం లేదా ఇతర కారణాల వల్ల బయట సమాజం ఆ బిడ్డను ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో" అని భయపడ్డారట. భవిష్యత్తులో ఆ బిడ్డకు ఎలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఆ ఆలోచన వద్దని వారించారని జయలలిత వివరించారు.
పెళ్లి జరగకపోవడానికి కారణాలు
తమ పెళ్లి జరగకపోవడంపై జయలలిత స్పందిస్తూ.. ఇండస్ట్రీలోనే కొందరు తమ బంధాన్ని, పెళ్లిని అడ్డుకున్నారని వెల్లడించారు. అలాగే శరత్ బాబుతో ఉన్న రుణం అంతవరకే ఉందేమో అని, దేవుడు తమను ఒకటి కాకుండా చేశాడని ఆవేదన చెందారు. అయినప్పటికీ జీవితాంతం ఆయనకు సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నానని చెప్పారు.
55
శరత్ బాబు వ్యక్తిత్వంపై ప్రశంసలు
శరత్ బాబు గుణగణాల గురించి చెబుతూ – "ఆయన ఒకరి రూపాయి తినేవారు కాదు, ఎవరికీ ఉచితంగా ఇచ్చేవారు కాదు. తన పరిధిలో నిజాయితీగా, ఆత్మాభిమానంతో జీవించే గొప్ప మనిషి" అని కొనియాడారు. చివరి రోజుల్లో ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించినప్పటికీ, ఆయన కన్నుమూసిన సమయంలో చివరిచూపు చూడలేకపోవడం తన జీవితంలో తీరని లోటుగా మిగిలిపోయిందని చెప్పారు.
రమాప్రభ చేసిన ఆరోపణల్లో నిజమెంత అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు తెలియదని, తాను రమాప్రభను 'అక్కా' అని పిలుస్తుంటానని చెప్పారు. "ఆమెకు ఇంకా ఏదైనా సహాయం చేయండి బావా" అని తానే శరత్ బాబును అడిగేదానినని జయలలిత తెలిపారు. శరత్ బాబు చాలా మంచివారని ఆమె అన్నారు.