Sigma 3 Days Collections: సిగ్మా మూవీ 3 రోజుల కలెక్షన్లు.. జేసన్‌ సంజయ్‌ మూవీకి బాక్సాఫీసు వద్ద దారుణమైన పరిస్థితి

Published : Oct 05, 2026, 09:11 AM IST

Sigma 3 Days Collections: విజయ్‌ కొడుకు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తూ రూపొందించిన చిత్రం `సిగ్మా`. సందీప్‌ కిషన్‌ హీరోగా ఈ చిత్రం గత శుక్రవారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూస్తుంది.

PREV
13
నెగటివ్‌ టాక్ తెచ్చుకున్న సిగ్మా

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా మారి `సిగ్మా` చిత్రాన్ని రూపొందించాడు. సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించగా, ఇందులో సంపత్‌రాజ్‌, రాజు సుందరం మాస్టర్‌ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. లైకా సంస్థ పతాకంపై సుభాస్కరణ్‌ నిర్మించారు. విజయ్‌ కొడుకు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న మూవీ కావడంతో దీనిపై ఆసక్తి ఏర్పడింది. గత శుక్రవారం విడుదలైన ఈ మూవీకి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. ఫస్ట్ షో నుంచే డిజాస్టర్‌ టాక్‌ని తెచ్చుకుంది. ఇక కలెక్షన్లు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. ఇది బాక్సాఫీసు వద్ద ఏమాత్రం సత్తా చాటలేకపోయింది. మరి ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి, ఆదివారం ఎంత వచ్చాయనేది చూస్తే.

23
సిగ్మా కలెక్షన్లు

సాధారణంగా ఏ సినిమాకైనా సండే రోజు కలెక్షన్లు పుంజుకుంటున్నాయి. కానీ దీనికి ఎలాంటి మార్పు లేదు. శనివారం ఎంత వచ్చాయో, ఆదివారం కూడా అంతే రాబట్టుకుంది. ఇక ఇండియా వైడ్‌గా ఈ సినిమాకి ఆదివారం రూ.1.70కోట్లు వచ్చాయి. మొత్తంగా మూడు రోజుల్లో రూ.5.35కోట్ల నెట్‌, రూ.6.10కోట్ల గ్రాస్‌ రాబట్టింది. ఓవర్సీస్‌లోనే ఈ సినిమాని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ.2.18కోట్లు రాగా, తమిళనాడులో రూ.3.15 కోట్లు, కర్నాటకలో రూ.47లక్షలు, కేరళాలో రూ.24 లక్షలు, నార్త్ లో రూ. 6 లక్షలు వచ్చాయి. తెలుగు, తమిళంలో పోటీపటీగా వసూళ్లు రావడం విశేషం.

33
సిగ్మా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌.. నష్టాలు తప్పవా

సిగ్మా మూవీకి అయిన బడ్జెట్‌ రూ.30కోట్లు అని సమాచారం. నాన్‌ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.23కోట్లు వచ్చాయట. ఇంకా ఏడు కోట్ల థియేట్రికల్‌ కలెక్షన్లు రావాలి. అంటే సుమారు రూ.15కోట్ల గ్రాస్‌ రావాలి. ఇప్పటి వరకు ఆరు కోట్లు వచ్చాయి. సోమవారం నుంచి ఈ సినిమా క్లోజ్‌ అయ్యే పరిస్థితి ఉంది. మొత్తంగా థియేట్రికల్‌గా మాత్రం ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగలబోతుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories