నాని, కయాదు లోహర్ జంటగా శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ది ప్యారడైజ్`. మోహన్ బాబు విలన్‌గా, సంపూర్ణేష్ బాబు, ఈశ్వరీ రావు, సోనాలి కులకర్ణి, విషిక, ప్రియదర్శి, సత్యరాజ్ వంటి వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలైంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ మూవీ మిక్స్ డ్ టాక్‌తో స్టార్ట్ అయ్యింది. అయినా కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది.