Mohan Babu: నన్ను అంత మాట అంటావా... సీనియర్ నటుడిని అవమానించిన మోహన్ బాబు, ట్విస్ట్ ఏంటంటే?

Published : Sep 11, 2026, 12:20 PM IST

ohan Babu: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోహన్ బాబు గురించి, మంచు ఫ్యామిలీ గురించి అందరికి తెలిసిందే. చాలా స్ట్రిక్ట్ గా ఉండే మోహన్ బాబు.. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా.. మాట అనడానికి వెనకాడేవారు కాదు. ఈక్రమంలోనేఓ సీనియర్ ఆర్టిస్ట్ ను ఆయన ఏమన్నాడో తెలుసా?

PREV
16
బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన మోహన్ బాబు..

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోలలో మోహన్ బాబు ఒకరు. హీరో అవ్వాలని పరిశ్రమకు వచ్చి.. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు చూశాడు మోహన్ బాబు. అవకాశాల కోసం కాళ్లరిగేలా తిరిగి.. చిన్న చిన్న పాత్రల ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి... విలన్ గా కెరీర్ బిగినింగ్ లో పాపులర్ అయ్యాడు మోహన్ బాబు. చాలా సినిమాల్లో నెగెటీవ్ రోల్స్ చేశాడు. ఆతరువాత హీరోగా మారి.. సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగించారు.

26
మోహన్ బాబు లెక్కలే వేరు..

ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన మోహన్ బాబు 45 ఏళ్ల కెరీర్ లో దాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించారు. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా సక్సెస్ ఫుల్ లైఫ్ ను చూశాడు. అయితే టాలీవుడ్ లో అందరు ఒక లెక్క అయితే.. మోహన్ బాబు లెక్కలే వేరుగా ఉంటాయి. నలుగురు ఒకలా ఆలోచిస్తే.. ఆయన ఒక్కడు మాత్రం సెపరేట్ గా ఆలోచిస్తారు. అందుకే మంచు ఫ్యామిలీ అంతా ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతుంటారు. మోహన్ బాబు కెరీర్ లో వివాదాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముక్కుసూటిగా మాట్లాడటం, వివాదాస్పద కామెంట్స్ తో మోహన్ బాబు వార్తల్లో నిలుస్తుంటారు. తనకు తప్పనిపిస్తే ఎదురుగా ఉన్నది ఎవరైనా ఏదో ఒకటి అనేస్తుంటాడు మోహన్ బాబు. అలాగే ఓ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ను ముఖం మీదే తిట్టాడట నట ప్రపూర్ణ. ఇంతకీ ఆయన ఎవరు? ఏమన్నాడంటే.

36
సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్..

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు జెన్నీ (Jenny). దాదాపు 50 ఏళ్లకు పైగా ఆయన ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఒక వైపు ఉద్యోగం చేసుకుంటూనే.. మరోవైపు సినిమాలు, నాటకాలతో బిజీ లైఫ్ ను లీడ్ చేశాడు జెన్ని. ప్రస్తుతం 80 ఏళ్లు దాటినా.. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ.. నటనపై తన ప్రేమను చాటుతున్నాడు జెన్ని. ఇక ఈమధ్య కాలంలో ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన సుదీర్ఘ నటనా ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన సంఘటనలను పంచుకున్నారు. ముఖ్యంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, దర్శకుడు ఈవీవీ సత్యనారాయణతో పనిచేసినప్పుడు జరిగిన సరదా సన్నివేశాలను ఆయన ఓ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

46
జెన్నీపై సీరియస్ అయిన మోహన్ బాబు

ఒక సినిమాలో జెన్నీ.. హీరో మోహన్ బాబు సినిమాలో నటిస్తున్నారు. ఇద్దరికి కాంబినేషన్ సీన్ ఒకటి పడింది. అందులో ఉన్న సీన్ ప్రకారంగా మోహన్ బాబుకి "విత్‌డ్రావల్ ఫారమ్ ఫిల్ అప్ చెయ్" అని ఏకవచనంలో చెప్పాల్సి వచ్చింది. అయితే డైలాగ్ చెప్పగానే మోహన్ బాబు కోపంగా "చెయ్ అంటావా? నేను హీరోని.. చేయండి అనాలి" అని సీరియస్ అయ్యారట.

వెంటనే జెన్నీ "స్క్రిప్ట్‌లో అలాగే ఉంది సార్" అని వివరణ ఇవ్వగా, మోహన్ బాబు గారు దర్శకుడిని పిలిచి "నన్ను పట్టుకుని ఏకవచనం ఉపయోగిస్తున్నాడయ్యా" అని సరదాగా అన్నారు . ఆ తర్వాత దర్శకుడు అది డైలాగ్ మాత్రమేనని స్పష్టం చేయడంతో మోహన్ బాబు గారు నవ్వి, "ఏమీ అనుకోకండి, బాగా చేశారు" అని జెన్నీని ప్రోత్సహించారు. అలా మోహన్ బాబు ముందు సీరియస్ అవ్వడంతో.. జెన్నీకి టెన్షన్ అనిపించింది. ఆతరువాత సరదాకి అలా చేశారని తెలియడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు.

56
హలో బ్రదర్' షూటింగ్‌లో బ్రహ్మానందం ఏం చేశాడంటే?

దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'హలో బ్రదర్' సినిమా షూటింగ్ రాత్రి 12 గంటలకు చలికాలంలో అవుట్‌డోర్‌లో జరుగుతోంది. సీన్ ప్రకారంగా జెన్నీ కత్తి పట్టుకుని బ్రహ్మానందం ని పొడవడానికి వెళ్లాలి. కానీ తీవ్రమైన చలి కారణంగా ఆయన చేయి గజగజా వణికిపోయింది. జెన్నీ వణకడం చూసిన ఈవీవీ "ఏంటి జెన్నీ, స్టేజ్ మీద ఉన్నట్టు అలా వణికిపోతున్నావ్?" అని అడిగారు. దానికి జెన్నీ "చలికి చెయ్యి ఆగడం లేదు సార్" అనడంతో, పక్కనే ఉన్న బ్రహ్మానందం స్పందించి, "మీరు అలాగే వణకండి, నేను దానికి తగినట్లు స్పాంటేనియస్‌గా డైలాగ్ వేస్తాను" అని చెప్పారు. అనుకున్నట్లే సీన్‌లో "వీడు మనల్ని పొడవడానికి వచ్చి వాడే వణుకుతున్నాడేంటి?" అని బ్రహ్మానందం చెప్పిన స్పాంటేనియస్ డైలాగ్ ఆ సన్నివేశానికి విశేషమైన హాస్యాన్ని తెచ్చిపెట్టింది.

66
దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి సీన్ క్రియేషన్

మరొక సినిమాలో సన్నివేశంలో దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి గారి సినిమాలో జరిగిన సంఘటనను జెన్నీ వివరించా బ్రహ్మానందానికి ఒక స్వామీజీ వరం ఇచ్చే సీన్ తర్వాత జెన్నీ షూటింగ్ పూర్తయింది. అయితే తర్వాతి సీన్‌లో బస్ స్టాప్‌ వద్ద బ్రహ్మానందం ఒక అమ్మాయితో గొడవపడే సన్నివేశం జరుగుతుండగా, జెన్నీ సరదాగా అక్కడికి వెళ్లారు . జెన్నీని చూసిన బ్రహ్మానందం "నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా?" అని అనడం, దానికి జెన్నీ "నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవపడతావా?" అని అనడం చూసిన ఎస్.వి. కృష్ణారెడ్డి ఆ మాటలను చాలా ఇష్టపడ్డారు. వెంటనే వారిద్దరి సంభాషణను ఆ సీన్‌లో యథాతథంగా చేర్చి షూట్ చేశారు. ఇలా నటుల మధ్య ఉండే అనుబంధం, స్పాంటేనియస్ టైమింగ్.. దర్శకుల సమయస్ఫూర్తి వల్లనే అప్పటి సినిమాలు ఎంతో సహజంగా, నవ్వులు పూయించేలా ఉండేవి అని.. జెన్నీ తన సినిమా కెరీర్ లో చూసిన విషయాలను ఆడియన్స్ తో శేర్ చేసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories