ఒక సినిమాలోని 'హే రామ్' డైలాగ్‌కు సెన్సార్ బోర్డు అడ్డు చెప్పింది. ఈ వివాదం ఏకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి చేరడంతో, స్వయంగా ప్రధాని నెహ్రూ ఆ సినిమా చూసి రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సినిమాలకు, సెన్సార్ బోర్డుకు మధ్య గొడవలు కొత్తేమీ కాదు. తమ సినిమాల్లోని సీన్లు లేదా డైలాగులకు కత్తెర వేయడంపై దర్శక, నిర్మాతలు ఫైర్ అవుతుంటారు. ఈ గొడవ ఎప్పటినుంచో ఉంది. కానీ ఒక సినిమాలోని 'హే రామ్' అనే డైలాగ్ వివాదం ఏకంగా ప్రధాని ఆఫీస్‌కు చేరింది. స్వయంగా ప్రధాని ఆ సినిమా చూశాకే రిలీజ్ అయ్యింది.
25
సెన్సార్ బోర్డ్
బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ తిగ్మాంశు ధులియా ఒక ఇంటర్వ్యూలో ఈ సంఘటన గురించి వివరించారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో, బ్రిటిష్ వారికి తెలియకుండా దేశభక్తిని రగిల్చే డైలాగులను దర్శకులు వాడేవారట. అందుకే సెన్సార్ బోర్డు అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారని ఆయన చెప్పారు.
35
గంగా జమునా సినిమా
దిలీప్ కుమార్ నటించిన 'గంగా జమున' సినిమా విడుదలను సెన్సార్ బోర్డు అడ్డుకుంది. సినిమాలోని ఒక సీన్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. ఆ సీన్‌లో దిలీప్ కుమార్ పాత్ర చనిపోయే ముందు 'హే రామ్' అని అంటుంది. ఈ డైలాగ్‌ను సెన్సార్ బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది.
ఇదే విషయంపై ధులియా మాట్లాడుతూ.. 'మీరు ముస్లిం కదా, 'హే రామ్' అని ఎలా అంటారు?' అని సెన్సార్ బోర్డు ప్రశ్నించిందని చెప్పారు. దీనికి దిలీప్ కుమార్ బదులిస్తూ.. 'సినిమాలో నాది గంగా అనే హిందూ పాత్ర. కాబట్టి గంగా తన చివరి క్షణాల్లో 'హే రామ్' అనొచ్చు' అని వాదించారు. ఈ వివాదం పెద్దదై చివరికి ప్రధాని కార్యాలయానికి చేరింది.
55
ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ
అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా 'గంగా జమున' సినిమా చూశారు. సినిమాలో ఎలాంటి వివాదాస్పద డైలాగులు లేవని నిర్ధారించుకుని, సినిమా విడుదలకు ఆదేశించారు. ఈ ఘటన తర్వాత, దిలీప్ కుమార్ సినిమాలకు ఏమైనా అడ్డంకులు వస్తే ప్రధాని సహాయం తీసుకుంటారనే గాసిప్ మొదలైంది. ఆ తర్వాత దిలీప్ కుమార్ సినిమాలకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని ధులియా చెప్పారు.