Chiranjeevi Movies: చిరంజీవి సినిమాల లైనప్ ఇదే..అందరూ సూపర్ హిట్ దర్శకులే, క్యూలో నలుగురు

Published : Sep 11, 2026, 11:17 AM IST

చిరంజీవి మన శంకర వరప్రసాద్ మూవీ భారీ హిట్ తర్వాత జోరు పెంచారు. చిరంజీవి నెక్స్ట్ సినిమాల లైనప్ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమలో కూడా ఆసక్తి పెంచుతోంది.

PREV
16
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాల లైనప్ యమా క్రేజీగా ఉంది. కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని సినిమాలు ప్రపోజల్ స్టేజీలో ఉన్నాయి. చిరంజీవి కోసం నలుగురు యువ దర్శకులు క్యూలో ఉన్నారు. అందరూ సూపర్ హిట్ సినిమాలు చేసిన దర్శకులే కావడం విశేషం. వాళ్లెవరో ఈ జాబితాలో చూద్దాం.

26
షూటింగ్ దశలో ఉన్న సినిమాలు

ప్రస్తుతం చిరంజీవి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కాకా అనే సినిమాలో నటిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 13న రిలీజ్ కానుంది. మరోవైపు చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూనే ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా క్లారిటీ లేదు. జానపద కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది.

36
శ్రీకాంత్ ఓదెల

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి చిత్రానికి గతంలో ప్రకటన వచ్చింది. ప్రస్తుతం శ్రీకాంత్, నాని కాంబోలో ప్యారడైజ్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీ తర్వాత చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల సినిమా ఉంటుందా లేక ఇంకా ఆలస్యం అవుతుందా అనేది చూడాలి.

46
బుచ్చిబాబు సానా

డైరెక్టర్ బుచ్చిబాబు రాంచరణ్ తో తెరకెక్కించిన పెద్ది మూవీ మంచి విజయం సాధించింది. బుచ్చిబాబు తన తదుపరి చిత్రం మెగాస్టార్ తో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

56
వెంకీ అట్లూరి

లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి వరుస హిట్లతో వెంకీ అట్లూరి క్రేజీ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. అందుతున్న సమాచారం మేరకు వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని చిరంజీవి తో చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కూడా అధికారిక సమాచారం లేదు.

66
శివ నిర్వాణ

రీసెంట్ గా శివ నిర్వాణ రవితేజతో ఇరుముడి చిత్రం తెరకెక్కించి తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇరుముడి సాధించిన కలెక్షన్స్ చూసి ఇండస్ట్రీ మొత్తం నివ్వెరపోయింది. అలాంటి శివ నిర్వాణ చిరంజీవి కోసం కథ రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories