బ్రా సైజ్‌ అడిగిన నెటిజన్‌కి నటి సయంతాని ఘోష్‌ మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రిప్లై..

First Published Apr 9, 2021, 5:35 PM IST

ప్రముఖ హిందీ-బెంగాలీ నటి సయంతాని ఘోష్‌ ఓ నెటిజన్‌కి మైండ్‌ బ్లాంక్‌ అయ్యే సమాధానం చెప్పింది. తన బ్రా సైజ్‌ అడిగినందుకు ఆమె ఓ రేంజ్‌లో మండిపడింది. ఇంతకి అసలేం జరిగిందనేది చూస్తే.. 

హిందీతోబెంగాలీలో లు టెలివిజన్‌ షోస్‌లో, టెలివిజన్‌ సిరీస్‌లో, అలాగే సినిమాల్లో నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సయంతాని ఘోష్‌ తాజాగా ఇన్‌స్టాలో కాసేపు అభిమానులతో ఛాట్‌ చేసింది.
undefined
వరల్డ్ హెల్త్ డేని పురస్కరించుకుని ఆమె నెటిజన్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు షాకింగ్‌ ప్రశ్నలను ఎదుర్కోవల్సి వచ్చిందట. ఓ నెటిజన్‌ తన `బ్రా` సైజ్‌ ఆడిగారట. దీనికామె ఫైర్‌ అయ్యింది.
undefined
బాడీ షేమింగ్‌ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `నిన్న నా ఇంటరాక్టివ్‌ సెషన్‌లో ఓ వ్యక్తి నా బ్రా సైజ్‌ అడిగారు. నేను ఆ వ్యక్తికి గట్టిగానే సమాధానం చెప్పా. నేను ఏం చెప్పానో మీ అందరికి తెలుసు. దాన్ని మెచ్చుకున్నారు కూడా.
undefined
అయితే దీని గురించి నేను చాలా మాట్లాడాలనుకుంటున్నా. మన బాడీ నిర్మాణం అనేది ఏదైనా ఉండటం చెడ్డదా?కానీ చాలా వరకు ఆడవారి బ్రెస్ట్ పట్ల ఆ మోహం ఏంటి? అనేది నన్ను బాగా తొలుస్తుంది. `సైజ్‌` మెంటాలిటీని మనం కట్‌ చేయాలి` అని చెప్పింది.
undefined
ఇంకా చెబుతూ, `ఓ మహిళగా నన్నునేను ఇష్టపడతాను. ప్రేమిస్తాను. మన కోసం మనం నిలబడే సమయం రావాలి. ఎందుకంటే మనల్ని ఇంకా ఎవరూ ఇష్టపడరు` అని చెప్పింది.
undefined
ఇలానే ఉంటే మరొకడు నా కప్‌ సైజ్‌ అడుగుతాడు. ఆ సమయంలో నేను ఏం సమాధానం చెప్పాలో నాకు తెలుసు. నిజాయితీగా చెప్పాలంటే నాకు పెద్ద కప్పు అంటే ఇష్టం. స్పష్టంగా కాఫీ ప్రేమికురాలిగా నేను పెద్ద కాఫీ కప్పుని కోరుకుంటున్నా` అని తెలిపింది.
undefined
అంతిమంగా సయంతాని ఘోష్‌ చెబుతూ, `సైజ్‌ మనస్థత్వాన్ని మనం అంతం చేయాలి` అని చెప్పింది. దానికి పరిష్కారం ఆమె కనుగొన్నదట. అమ్మాయి బాడీపై వ్యామోహాన్ని తగ్గించాలనిచెప్పింది. ఆరోగ్యంపై ఫోకస్‌ పెట్టాలని పేర్కొంది.
undefined
కోల్‌కతాలో జన్మించిన సయంతాని ఘోష్‌ మోడలింగ్‌ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అనంతరం 2002లో `కుంకుమ్‌ః ఏక్‌ ప్యార్‌ సా బంధన్‌` టెలివిజన్‌లో నటించింది. ఫేమస్‌ సీరియల్‌ కావడంతో సయంతాని ఘోష్‌ కూడా పాపులర్‌ అయ్యింది.
undefined
ఆ తర్వాత కొన్నాళ్ల గ్యాప్‌ తర్వాత `రాజు ఆంకుల్‌` అనే సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత `నాయక్‌ః ది రియల్‌ హీరో` సినిమాలో చేసింది. నెక్ట్స్ ఇయర్‌ `స్వప్నో`,`సంఘర్ష్‌` చిత్రాల్లో నటించి నటిగామంచి గుర్తిం తెచ్చుకుంది.
undefined
కానీ ఉన్నట్టుండి ఆమె తన కెరీర్‌ని టెలివిజన్‌ వైపు మళ్లించింది. హిందీ సీరియల్స్ లో నటించడం స్టార్ట్ చేశాక సినిమాలు మానేసింది. పాపులర్‌ టెలివిజన్‌ `నాగిన్‌`, అలాగే రియాలిటీ షో `బిగ్‌బాస్‌`లో పాల్గొని మరింతగా పాపులర్‌ అయ్యింది. ప్రస్తుతం ఆమె హిందీ టెలివిజన్‌లో ఫేమ్‌ నటిగా రాణిస్తుండటం విశేషం. ప్రస్తుతం `తేరా యార్‌ హూన్‌ మెయిన్‌` అనే టెలివిజన్‌లో నటిస్తుంది.
undefined
click me!