Samantha: తృటిలో తప్పించుకున్నా, లేదంటే నా లైఫ్‌ కూడా సావిత్రిలా అయిపోయేది.. ప్రేమపై సమంత కామెంట్‌

Published : Apr 09, 2026, 11:34 AM IST

సమంత ప్రేమ గురించి షాకింగ్‌ కామెంట్‌ చేసింది. ప్రేమ విషయంలో తాను ఒకరిని నమ్మానని, కానీ తృటిలో తప్పించుకున్నానని, లేదంటే తన లైఫ్‌ కూడా సావిత్రిలాగే అయ్యేదని కామెంట్‌ చేయడం గమనార్హం. 

PREV
14
నాగ చైతన్యతో విడిపోయాక రెండో పెళ్లి చేసుకున్నాక సమంత

సమంత ఇటీవల రెండో పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్‌ నిడిమోరుని ఆమె పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు హీరో నాగచైతన్యని మ్యారేజ్‌ చేసుకుంది. వీరిది ప్రేమ పెళ్లి. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. చాలా గ్రాండ్‌గా వీరి మ్యారేజ్‌ జరిగింది. కానీ పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయారు. అయితే ప్రేమకి సంబంధించి సమంత చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ విషయంలో తాను తృటితో తప్పించుకున్నానని, లేదంటే తన లైఫ్‌ కూడా సావిత్రిలా మారేదని చెప్పడం షాకిస్తోంది.

24
`మహానటి`లో రిపోర్టర్ గా మెరిసిన సమంత

సమంత ఎనిమిదేళ్ల క్రితం 2018లో `మహానటి` చిత్రంలో నటించింది. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో కీర్తిసురేష్‌ సావిత్రిగా నటించింది. జెమినీ గణేషన్‌గా దుల్కర్‌ సల్మాన్‌ నటించారు. సమంత రిపోర్టర్‌గా నటించింది. ఆమెకి జోడీగా విజయ్‌ దేవరకొండ కనిపించాడు. ఈ సినిమా పెద్ద హిట్‌ అయ్యింది. కీర్తిసురేష్‌కి ఏకంగా జాతీయ అవార్డు వరించింది. బయోపిక్‌ చిత్రాల్లో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిందని చెప్పొచ్చు.

34
తృటిలో తప్పించుకున్న, లేదంటే సావిత్రిలా అయిపోయేదాన్ని

అయితే ఈ సినిమా సినిమా సమయంలో సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆమె మాట్లాడుతూ, `సావిత్రి గారి గురించి పెద్దగా తెలియదు, ఈ సినిమా చేశాక చాలా విషయాలు అర్థమయ్యాయి. కొన్ని కొన్ని చోట్ల `అరె.. ఇది నా కథలా ఉందే` అనిపించింది. ప్రేమ విషయంలో ఒకసారి నేనూ ఇలానే నమ్మాను కదా? కానీ అదృష్టం కొద్దీ తృటిలో తప్పించుకున్నాను. అందులోనుంచి త్వరగా బయటపడ్డాను. లేదంటే నా కథ సావిత్రిలానే అయ్యేది. నేను చేసుకున్న పుణ్యం, అదృష్టం వల్లే చై(నాగచైతన్య) దొరికాడు` అని తెలిపింది సమంత. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అయితే నాగచైతన్యకి ముందు ఆమె మరో వ్యక్తిని ప్రేమించిందని, ఆ విషయంలో మోసపోయిందనే విషయం స్పష్టమవుతుంది. అయితే కోలీవుడ్‌ హీరో సిద్ధార్థతో కొన్ని రూమర్స్ వినిపించాయి. అయితే సమంత చెప్పింది ఆయన్ని ఉద్దేశించేనా అనేది సస్పెన్స్. సమంత ఈ విషయాన్ని `మహానటి` రిలీజ్‌ టైమ్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

44
`మా ఇంటి బంగారం`తో రాబోతున్న సమంత

సమంత, నాగచైతన్య `ఏం మాయ చేసావె` చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా టైమ్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు కలిసి `మనం`, `ఆటోనగర్‌ సూర్య`, `మజిలి` వంటి చిత్రాల్లో నటించారు. 2017లో మ్యారేజ్‌ చేసుకున్న ఈ జంట 2021లో విడిపోయింది. నాలుగేళ్లు కలిసి ఉన్నారు. వీరిద్దరు విడిపోవడానికి సరైనా కారణాలు తెలియరాలేదు. ఇక ప్రస్తుతం నాగచైతన్య కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్‌ శోభితా దూళిపాళ్లని వివాహం చేసుకోగా, సమంత.. దర్శకుడు రాజ్‌ నిడిమోరుని మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత `మా ఇంటి బంగారం` మూవీతో కమ్‌ బ్యాక్‌ కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories