తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా..
సహజమైన అందం, అద్భుతమైన నటనతో మీనా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. 1980-90ల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సుమన్, శ్రీకాంత్, తమిళంలో.. రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, సత్యరాజ్, శరత్‌కుమార్, అజిత్ కుమార్ వంటి ఎందరో టాప్ హీరోలతో కలిసి హిట్ సినిమాల్లో నటించింది.
ఇప్పటికీ కూడా తమిళం, తెలుగు, మలయాళంలో బిజీ ఆర్టిస్ట్ గానే కొనసాగుతోంది మీనా. మలయాళంలో మోహన్‌లాల్‌తో కలిసి నటించిన 'దృశ్యం 3' సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.