నటసింహం నందమూరి బాలకృష్ణ అలవాట్ల గురించి అందరికి తెలిసిందే. ఆయన ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారన్నది కూడా తెలుసు. అయితే ఉదయాన్నే లేవగానే బాలయ్య బాబుకు ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉందట. అది మాత్రం వదల్లేకకపోతున్నారట. దానికి కారణం ఏంటో తెలుసా?
ప్రస్తుతం సీనియర్ హీరోలలో వరుస సక్సెస్ లతో జోరుమీద ఉన్నది నటసింహం బాలయ్య మాత్రమే.. వరుసగా నాలుగైదు సక్సెస్ లతో బాలకృష్ణ మంచి ఫామ్ లో ఉన్నాడు. అభిమానులను అలరిస్తున్నాడు. 65 ఏళ్ల వయసులో కూడా తగ్గేది లేదంటూ.. యాక్షన్ సీన్స్ తో అదరగొడతున్నాడు నటసింహం.
బాలయ్య నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2 లో.. నందమూరి హీరో విశ్వరూపం చూపించాడు. ఆ యాక్షన్ సీన్స్ కు, సౌండ్ ఎఫెక్ట్స్ కు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ప్రస్తుతం డబుల్ హ్యాట్రిక్ టార్గెట్ గా బాలకృష్ణ అడుగులు వేస్తున్నాడు. అందుకోసం చాలా జాగ్రత్తగా సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్నాడు.
25
బాలయ్య లైఫ్ స్టైల్ డిఫరెంట్..
బాలయ్య సినిమా లైఫ్ తో పాటు.. పర్సనల్ లైఫ్ లో కూడా ఎప్పుడూ ఏదో ఒక వార్తతో వైరల్ అవుతుంటాడు. ఓవరాక్షన్ చేసిన అభిమానులను కొట్టడం, వార్నింగ్ లు ఇవ్వడం, కాంట్రవర్సియల్ కామెంట్స్ చేయడం.. ఇలా బాలయ్య హల్ చల్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన ఏది మాట్లాడినా.. అది స్పెషల్ గానే ఉంటుంది. ఇక బాలకృష్ణ అలవాట్లు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఆయన ఫుడ్, లైఫ్ స్టైల్ అందరికంటే భిన్నంగా ఉంటుంది.
35
ఉదయం 3 గంటలకే డే స్టార్ట్..
బాలకృష్ణకు ఉదయాన్నే లేచి.. వ్యాయామం, పూజ చేసే మంచి అలవాటు ఉంది. వీటితో పాటు బాలయ్యకు ఓ బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉందట. ఉదయం 3 గంటలకు లేవగానే బాలకృష్ణ ఒక చుట్ట కాల్చుతారట. పొగ త్రాగడం ఆరోగ్యానికి హనికరం అంటారు కదా.. మరి పొద్దు పొద్దున్నే బాలయ్య ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? దానికి ఒక కారణం కూడా ఉంది.
నటసింహం చుట్ట త్రాగడానికి ఓ రహస్య కారణం ఉంది. ఈ విషయాన్ని బాలయ్య వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ టైమ్ లో వెల్లడించారు. డైలాగ్ చెప్పడానికి వీలుగా, వాయిస్ క్లియరెన్స్ కోసం బాలకృష్ణ ఈ పని చేస్తారట. ఈ విషయంలో ఆయన ఏమన్నారంటే?
ఉదయాన్ని చుట్ట కాల్చడం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. '' నేను ఉదయన్నే మూడు గంటలకు నిద్ర లేస్తాను.. నాన్నగారిలాగానే వ్యాయామం, పూజ చేస్తాను. ఆయన నుంచే నాకు ఈ అలవాటు వచ్చింది. అయితే ఉదయం లేవగానే ముందుగా ఓ చుట్టు తాగుతాను. దానికి ఓ కారణం ఉంది. నేను ఏదైనా డైలాగ్ చెప్పాలంటే.. వాయిస్ క్లియర్ గా ఉండాలి.
ఒక సారి జీర వచ్చిందంటే.. ఇక కాన్ఫిడెంట్ గా ఆ డైలాగ్ చెప్పలేను.. టేకుల మీద టేకులు తీసుకుంటాను.. అందుకే ఆ ప్రాబ్లమ్ రాకూడదని.. ఉదయాన్ని చుట్ట తాగుతాను.. ఆ పొగ లోపలికి తీసుకోము.. కానీ చుట్టను బలంగా పీల్చే క్రమంలో.. లోపల ఉన్న ప్లమ్ బయటకు వస్తుంది. వాయిస్ క్లియర్ అవుతుంది. అందుకే ఉదయాన్నే ఓ చుట్టు తాగుతాను'' అని బాలయ్య స్వయంగా వెల్లడించారు.
55
బాలయ్య బాబు సినిమాలు..
వరుసగా సక్సెస్ లు చూస్తూ వస్తున్నాడు బాలకృష్ణ.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్, అఖండ2 సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. మరో సినిమా హిట్ అయితే.. ఆయన ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ హిట్ ఆడ్ అవుతుంది. ఇక నెక్ట్స్ సినిమా మలినేని గోపీచంద్ తో చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందని టాక్. ఇటు హీరోగా సినిమాలు చేస్తూనే.. అటు ఎమ్మెల్యేగా పొలిటికల్ కెరీర్ ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు బాలయ్య.