Published : Feb 06, 2025, 07:16 AM ISTUpdated : Feb 08, 2025, 06:37 PM IST
Samantha Reacts to Naga Chaitanya - Sobhita Marriage: సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య - శోభిత పెళ్లిపై చాలా తెలివిగా స్పందించారు సమంత. ఇక తనపై ఇప్పటికి వస్తున్న విమర్శలపై కూడా గట్టిగానే స్పందించారు సామ్. రకరకాల కామెంట్లు చేసేవారి నోరు ఒక్క సమాధానంతో మూయించారు సమంత.
Samantha Reacts to Naga Chaitanya - Sobhita Marriage: సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్ళి,పిల్లలు అంటేనే మహిళ హ్యాపీగా ఉన్నట్టా అని ప్రశ్నించారు. తనపై వస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సామ్. పెళ్లి చేసుకుని పిల్లలు ఉంటేనే స్త్రీ పరిపూర్ణం అనే భావనను తిప్పికొట్టాలనుకుంటున్న సమంతా, ఇప్పుడు ఒంటరిగా ఉన్నా సంతోషంగానే ఉన్నానన్నారు. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ఆమె మాట్లాడారు.
తన గురించి వస్తున్న రకరకాల వార్తలపై కూడా ఆమె చాలా తెలివిగా స్పందించారు. తన సమాధానం అందరి నోర్లు మూయించే ప్రయత్నం చేశారు. ఎవరి పేరూ ప్రస్తావించకుండానే, ఆమె మాజీ భర్త నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహం గురించి ప్రశ్న ఆమెకు ఎదురయ్యింది. దాని గురించి బాధగా ఉందా అని కూడా అడిగారు. దానికి సమంతా ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
"పరిపూర్ణ స్త్రీ కావాలంటే పెళ్లి చేసుకుని పిల్లలు కనాలి అనే భావన ఉంది. అలా కాకపోతే ఆమె బాధగా, ఒంటరిగా ఉంటుంది అనుకోవడం తప్పు. అందులో నిజం లేదు" అని సమంతా అన్నారు. ఈ రకంగా మహిళలు వాటికోసమే అన్న భావన పోవాలి అని సమంత ఇండైరెక్ట్ గా అన్నారు. తన గురించి ఆలోచిస్తున్నవారికి కూడా ఇది సరైన సమాధానం అని చెప్పుకోవచ్చు.
ఒక స్త్రీ సొంతంగా సంతోషంగా, విజయవంతంగా ఉండగలదని అంగీకరించాలి అని ఆమె నొక్కి చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా, నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహం గురించి అడిగిన ప్రశ్నకు సమంతా చాాలా తెలివిగా సమాధానం ఇచ్చారు.
నా జీవితంలో చాలా చూశాను, అన్నీ ఇప్పుడు ఆలోచించలేను. నాకు ద్వేషం అస్సలు నచ్చదు. ద్వేషం అన్ని చెడులకు మూలం. ద్వేషం లాంటి చెడు ఆలోచనలకు నేను చోటు ఇవ్వను అని సమంత అన్నారు. ప్రస్తుతం సమంత చేసిన క ామెంట్స్ వైరల్ అవుతున్నాయి.