#MAX OTT: కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' OTTలోకి.. ఎప్పుడంటే?

Published : Feb 06, 2025, 06:58 AM IST

#MAX OTT:  కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' త్వరలో OTTలో విడుదల కానుంది.  

PREV
13
#MAX OTT:  కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' OTTలోకి.. ఎప్పుడంటే?

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'మ్యాక్స్' . రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్‌లో క్రేజ్‌ తెచ్చుకున్న సుదీప్‌ ఆపై బాహుబలిలో కూడా ఛాన్స్‌ దక్కించుకున్నారు. దాంతో ఆయనకు తెలుగులో కూడా మార్కెట్ ఏర్పడింది.

ఈ నేపధ్యంలో ఇక్కడ కూడా మాక్స్ సినిమాని భారీగానే విడుదల చేసారు. అయితే యాక్షన్ మూవీ లవర్స్ కు ఈ సినిమా నచ్చింది. మిగతా వాళ్లకు ఎక్కలేదు. ఓటిటిలో వచ్చినప్పుడు ఈ డబ్బింగ్ సినిమాని చూద్దాములే అని ప్రక్కన పెట్టేసారు. తాజాగా ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.
 

23


 క్రిస్మస్ సందర్భంగా ఆడియెన్స్ ముందుకు మ్యాక్స్  మూవీ  అన్నీ అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి 22 న ZEE5 ఓటిటి ప్రీమియర్ జరగనుంది. తెలుగుతో సహా దాదాపు అన్ని ప్రధానమైన లాంగ్వేజ్ లలో ఈ సినిమా స్ట్రీమింగ్ జరుగుతుంది. అయితే ఈ విషయమై ZEE5 ఇంకా అఫీషియల్ గా ఎనౌన్సమెంట్ అయితే రాలేదు. ఓటిటిలో ఈ సినిమా బాగా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నారు.

33

మ్యాక్స్ సినిమాలో మాస్ ఆడియెన్స్‌కు నచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు, హై మూమెంట్స్ అయితే చాలానే ఉన్నాయి. థ్రిల్లింగ్ మూమెంట్స్ కావాలని అనుకునే ఆడియెన్స్‌కి అవి కూడా ఉంటాయి.

కొన్ని చిన్న ట్విస్టులు ఉంటాయి. ఆడియెన్స్ ఊహించే ట్విస్ట్‌కి భిన్నంగానూ ఆ ట్విస్టులు ఉంటాయి.  క్లైమాక్స్ ఫైట్ అయితే ఖైదీ, విక్రమ్ రేంజ్‌లో ఉంది. ఈ సినిమాకు టెక్నికల్ టీం ఫుల్ సపోర్ట్‌గా నిలిచింది. 
 

Read more Photos on
click me!

Recommended Stories