సమంత లైఫ్‌ని మార్చేసిన వ్యక్తి ఎవరో తెలుసా? సామ్‌ ఎమోషనల్‌ పోస్ట్

Published : Dec 03, 2025, 05:11 PM IST

సమంత ఇటీవలే దర్శకుడు రాజ్‌ నిడిమోరుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆమె తన జీవితాన్ని మార్చేసిన మరో వ్యక్తి గురించి ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. 

PREV
15
రాజ్‌ నిడిమోరుని పెళ్లి చేసుకున్న సమంత

సమంత ఈ సోమవారం(డిసెంబర్‌ 1న) రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు రాజ్‌ నిడిమోరుని ఆమె వివాహం చేసుకుంది. కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో సమంత, రాజ్‌ నిడిమోరు ఒక్కటయ్యారు. అయితే వీరి వివాహానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వీరిద్దరు ఎప్పుడో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారని అంటున్నారు. సమంత చేతికి రింగ్‌ని చూసి ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితమే వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఓ వైపు ఇది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మరోవైపు సమంత లేటెస్ట్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

25
పెళ్లి ఫోటోలు పంచుకుంటూ సమంత ఎమోషనల్‌ పోస్ట్

సమంత, రాజ్‌ నిడిమోరు పెళ్లికి సంబంధించిన మరికొన్ని ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌లో పంచుకుంది సమంత. పెళ్లి సందర్భంగా తాను దిగిన పిక్స్ ని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది. అయితే ఇందులో ఓ వ్యక్తి గురించి ఆమె ప్రత్యేకంగా పోస్ట్ పెట్టింది. తన లైఫ్‌ని మార్చింది ఆమెనే అని పేర్కొంది. ఆమె ఎవరు అనేది చూస్తే, సమంత గుర్తుచేసుకున్నది తన స్నేహితురాలు శిల్పారెడ్డి. ఆమె మోడల్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌. సోషల్‌ యాక్టివిస్ట్ కూడా.

35
శిల్పా రెడ్డితో కలిసి బిజినెస్‌ చేస్తోన్న సమంత

సమంత, శిల్పారెడ్డి మంచి స్నేహితులు. కలిసి సాకి పేరుతో దుస్తుల కంపెనీని ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో తమ దుస్తులను అమ్ముతుంటారు. మహిళలకు సంబంధించిన లేటెస్ట్ డిజైన్స్ ని ఇందులో ఉంచుతారు. వాటికి సంబంధించిన అప్‌ డేట్లని తన సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటుంది సమంత. అదే సమయంలో నిత్యం ఆమెతో కలిసి దిగిన ఫోటోలను కూడా పంచుకుంటుంది సమంత.

45
తన లైఫ్‌ని మార్చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ సామ్‌ పోస్ట్

తాజాగా పెళ్లి సందర్భంగా శిల్పారెడ్డితో కలిసి దిగిన ఫోటోని పంచుకుంటూ, `నువ్వు నా జీవితాన్ని అనేక విధాలుగా చాలా మార్చేశావు. అదేంటో నీకు తెలుసు. నా ఈ బహుమతికి ధన్యవాదాలు. మీరు నన్ను 15 నిమిషాల ధాన్యంలోకి నెట్టారు. అది నిజంగా నా జీవిత గమనాన్ని మార్చివేసింది` అని పేర్కొంది సమంత. ఈ సందర్భంగా సమంత పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

55
ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 తో సమంత, రాజ్‌ నిడిమోరు పరిచయం

సమంత గతంలో నాగచైతన్యని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లపాటు ఆమె, చైతన్య ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021లో విడిపోయారు. నాలుగేళ్లు ఒంటరిగా ఉన్న సమంత ఇప్పుడు ఎట్టకేలకు రెండో పెళ్లి చేసుకుంది. దర్శకుడు రాజ్‌ నిడిమోరు హిందీలో `ది ఫ్యామిలీ మ్యాన్‌` సిరీస్‌లను రూపొందిస్తున్నారు. చివరగా `ది ఫ్యామిలీ మ్యాన్‌ 3` సిరీస్‌ కూడా విడుదలైంది. అయితే రెండో సీజన్‌లో సమంత నటించడం విశేషం. దీంతోపాటు `సిటాడెల్‌` సిరీస్‌లోనూ సమంత, రాజ్‌ నిడిమోరు కలిసి పనిచేశారు. ఇక ఇప్పుడు `మా ఇంటి బంగారం` అనే చిత్రంలో నటిస్తోంది సామ్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories