సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ అంత మాట అనేశారు ఏంటి ? కృష్ణ, చిరంజీవికి సాధ్యమైంది వాళ్ళ వల్ల కాదు

Published : Dec 03, 2025, 04:16 PM IST

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు పవన్, మహేష్, రాంచరణ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిని కృష్ణ, చిరంజీవి ఎన్టీఆర్ లతో పోల్చుతూ అభిమానుల గురించి ఓ విషయం చెప్పారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
అది మొదలైంది ఎన్టీఆర్ తోనే.. 

 సూపర్ స్టార్ కృష్ణ వరుస సినిమాలు చేస్తున్న సమయంలో ఆయన బ్రదర్ ఆదిశేషగిరి రావు నిర్మాణ బాధ్యతలు చూసుకునేవారు. పద్మాలయ బ్యానర్ లో అనేక సినిమాలు నిర్మించారు. టాలీవుడ్ లో అభిమానులు హీరోలని ఆరాధ్య దైవంలా భావిస్తారు. ఆ ఆరాధన భావం మొదలైంది ఎన్టీఆర్ తోనే. దీనిపై అది శేషగిరి రావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

25
సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ ఆదిశేషగిరి రావు కామెంట్స్

  ''తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలని అమితంగా అభిమానించే అభిమానులు కేవలం ముగ్గురికి మాత్రమే ఉన్నారు. ఎన్టీఆర్ గారికి అలాంటి అభిమానులు ప్రారంభమయ్యారు. ఆ తర్వాత కృష్ణ గారికి అలాంటి అభిమానులే ఉన్నారు. వీరిద్దరి తర్వాత చిరంజీవి ఆ తరహా ఫాలోయింగ్ లభించింది. వీరి అభిమానులు ఇక మారే వారు కాదు. ఒకసారి వీరి అభిమానులుగా మారితే జీవితాంతం వాళ్ళ అభిమానులుగానే కొనసాగేవారు'' అని ఆదిశేషగిరి రావు అన్నారు. 

35
పవన్, మహేష్ లకు అలాంటి అభిమానులు లేరు 

మిగిలిన హీరోలకు ఉండే అభిమానులు వేరు. వాళ్ళు చేసే సినిమాలకు మాత్రమే అభిమానులు ఉంటారు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి తరహా ఫాలోయింగ్ ఇంకెవరికీ సాధ్యం కాదు. ఇప్పుడున్న హీరోలు మహేష్, పవన్, రాంచరణ్ లాంటి వాళ్లకు వాళ్ళ సినిమాలకు మాత్రమే అభిమానులు ఉంటారు అని ఆది శేషగిరి రావు అన్నారు. మహేష్ బాబుకి కృష్ణగారి నుంచి అభిమానులు వచ్చారు. వీళ్ళు కాకుండా అదనంగా మహేష్ చేసే సినిమాలకు అభిమానులు ఉంటారు. 

45
సినిమాలకు మాత్రమే అభిమానులు 

పవన్, రాంచరణ్ లకు కూడా అంతే. చిరంజీవి గారి నుంచి వాళ్లకు అభిమానులు వచ్చారు. వాళ్ళు చేసే సినిమాలని బట్టి అదనంగా అభిమానులు వస్తుంటారు అని ఆది శేషగిరి రావు తెలిపారు. 

55
చర్చకు దారితీసిన వ్యాఖ్యలు 

అయితే ఆదిశేషగిరి రావు చేసిన వ్యాఖ్యలతో పవన్, మహేష్ అభిమానులు ఏకీభవించడం లేదు. కృష్ణ, చిరంజీవి నుంచి మహేష్, పవన్ లకు అభిమానులు వచ్చినప్పటికీ.. వీరిద్దరూ తమ సొంతంగా అభిమానులు ని సంపాదించుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సరికొత్త చర్చకు దారి తీశాయి. 

Read more Photos on
click me!

Recommended Stories