Chiranjeevi 101 Fever : మెగాస్టార్ చిరంజీవి పని విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. నిర్మాతకు టైమ్ ఇస్తే.. ఆ టైమ్ కు ఎటువంటి పరిస్థితులు ఎదరైనా.. షూటింగ్ కు వస్తారు. ఓ సారి 101 జ్వరం ఉన్నా సరే.. వానపాటకు డ్యాన్స్ చేయడానికి వచ్చేశారట చిరంజీవి
సాధారణ చిరంజీవి.. మెగాస్టార్ గా ఎదగడానికి ఆయన డెడికేషన్, పట్టుదల, కృష్ణి కారణం. వెనకడుకు వేయని మనస్థత్వం మెగా హీరోది. అందుకే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా షూటింగ్ కు డుమ్మా కోట్టేవారు కదట. ఆకరికి ఒంట్లో బాగోలేకపోయినా మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ ను కంటీన్యూ చేసిన రోజులు ఉన్నాయి. ఎంత రిస్క్ షాట్స్ అయినా.. డేర్ చేసి షూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరూ.. ప్రయత్నం కూడా చేయలేని డ్యాన్స్ మూమెంట్స్ ను చిరంజీవి 30 ఏళ్ల క్రితమే చేసి చూపించారు. అంతే కాదు జ్వరంతో ఉండి కూడా చల్లని చలిలో.. వానపాటలకు డ్యాన్స్ చేసి, పని పట్ల తన అంకితభావం చూపించుకున్నారు చిరంజీవి. తన డెడికేషన్ ను చాలా సందర్భాల్లో నిరూపించుకున్నారు.
25
సీనియర్ నటుడు చెప్పిన మెగా రహస్యం..
మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా మాట్లాడారు. రీసెంట్ గా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని వెల్లడించారు. ఇండస్ట్రీలో చిరంజీవి ఎంత కష్టపడతాడో చెప్తూ ఓ సంఘటనను ఉదాహరణగా వివరించారు శివరాజీ రాజా. మెగాస్టార్ గురించి శివాజీ రాజా మాట్లాడుతూ.. ''ఆయన ఒక అద్భుతం. మద్రాస్ లో మా ఇంటి వెనకాలే చిరంజీవి ఉండేవారు. ఒక సారి 101 జ్వరం ఉన్నా లెక్క చేయకుండా వాన సాంగ్ చేయడానికి షూటింగ్ కు వెళ్ళారు. అక్కడివారికి ఈ వియం తెలియదు. ఆ సాంగ్ ఏదో కాదు సూపర్ హిట్ ఎవర్ గ్రీన్ రెయిన్ సాంగ్ ''వాన వాన వెల్లువాయే'' . ఆసాంగ్ ను ఆరోగ్యం బాగోలేకపోయినా వెళ్లి షూటింగ్ చేశారు. షూటింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చారు. జ్వరంతో వణికిపోతున్నారు. నేను అప్పుడు చిరంజీవి ఇంటికి నాగబాబుతో కలిసి వెళ్ళాను. అప్పుడు వాళ్ల నాన్న అక్కడే ఉన్నారు. ఆయనకు చిరంజీవి మీద కోపం వచ్చింది. జ్వరంతో అలా వానపాట చేశారని ఆయన అలిగారు. ఇక అక్కడ పరిస్థితి నాకు అర్ధం అయ్యింది. వెంటనే ఆ ఇంట్లోంచి వచ్చేశాను. ఆయన డెడికేష్ ఆ రేంజ్ లో ఉంటుంది. అలా ఎవరూ చేయలేరు కూడా'' అని శివాజీ రాజా వెల్లడించారు.
35
బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్
''వాన వాన వెల్లువాయే'' సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. గ్యాంగ్ లీడర్ సినిమాలోని ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్. ఇప్పటికీ మెగా అభిమానుల ప్లే లిస్ట్ లో ఈ సాంగ్ ఉండాల్సిందే. అంతే కాదు గ్యాంగ్ లీడర్ సినిమా కోసం కూడా చిరంజీవి చాలా కష్టపడ్డాడు. ఈసినిమాతో మెగాస్టార్ కు మాస్ ఇమేజ్ రెట్టింపు అయ్యింది. మాస్ సెంటర్స్ లో ఈ సినిమా తెగ ఆడేసింది. ఈ పాటను మళ్లీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రచ్చ సినిమాలో రీమిక్స్ చేసి వాడారు. ఒరిజినల్ సాంగ్ లో చిరంజీవితో పాటు విజయశాంతి ఆడి పాడగా.. రీమీక్స్ లో తమన్నా చరణ్ తో కలిసి రొమాంటిక్ పెర్ఫామెన్స్ ఇచ్చింది.
ఒక్కడుగా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి.. తన కష్టంతో మెగా సామ్రాజ్యాన్ని నిర్మించాడు చిరంజీవి. తన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవన్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా హీరోలు, నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, ఇలా చిరంజీవి ఇంటి నుంచి ఎంతో మంది హీరోలు, నటులు, నిర్మాతలు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినవారు కూడా ప్రస్తుతం స్టార్ హోదాలో కొనసాగుతున్నారు. ఎంతో మంది దర్శకులు కూడా మెగాస్టార్ స్పూర్తితోనే టాలీవుడ్ లో కి వచ్చి రాణిస్తున్నారు.
55
చిరంజీవి వరుస సినిమాలు..
ఆమధ్య వరుసగా ప్లాప్ లు ఫేస్ చేసిన చిరంజీవి. ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలతో అభిమానులను అలరించబోతున్నారు. ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన మన శంకర వరప్రసాదు గారు సినిమాతో రాబోతున్న చిరు.. ఆతరువాత విశ్వంభర మూవీతో సందడి చేయబోతున్నారు. ఇక తనకు వాల్తేరు వీరయ్య లాంటి హిట్ ను అందించిన బాబీకి మరో ఛాన్స్ ఇచ్చాడు మెగాస్టార్. ఈసినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. మరికొందరు దర్శకులు మెగా మూవీ కోసం క్యూలో ఉన్నారు. 70 ఏళ్ల వయసులో కూడా అదే గ్రేస్, అదే స్టైల్, అదే ఎనర్జీతో దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి.