ఇక సిటడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ కోసం చాలా ప్రమోషన్స్ చేసింది సమంత. ఈ దర్శకులతో అంతకు ముందు ప్యామిలీమెన్ 2 వెబ్ సిరీస్ లో నటించింద ిసమంత. ఇక సిటడెల్ ప్రచారంలో భాగంగా సమంత వరుసగా మీడియా సమావేశాల్లో కూడా పాల్గొంది. అలా ఓ కార్యక్రమం కోసం సమంత బయటకు వచ్చినప్పుడు పాము లాంటి వాచీ ఒకటి పెట్టుకుంది.
ఇప్పుడు దాని గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.ఆ పాములాంటి వాచ్ ధర అక్షరాలా 20 లక్షలు అని అంటున్నారు. సిటడెల్: ప్రీమియర్‌కి వచ్చినప్పుడు ఆ వాచీ సమంత చేతికి కనిపించింది.
హై హీల్స్, గోల్డెన్ కలర్ కలర్ డ్రెస్‌లో సామ్ మెరిసిపోయింది. ఈ క్రమంలో చేతికి ఓ చిన్న పాము చుట్టినట్లు వాచీ పెట్టుకుంది. BVLGARI సంస్థకు చెందిన సర్‌పెంటీ టుబోగాస్ వాచీ ని ఆమెధరించింది. దాంతో సోషల్ మీడియా జనాలు వెంటనే దానికంపెనీ ఏంటి..? రేటు ఏంటి అనేది సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు.