ఆ హీరోయిన్ భుజంపై చేయి వేయడానికి భయపడిన అక్కినేని నాగేశ్వరావు. కారణం ఏంటి..?

Published : Nov 07, 2024, 07:01 PM IST

తెలుగు సినిమాకు రెండు కళ్ళలాంటివారు ఎన్టీఆర్, ఏఎన్నారు. అటువంటి పెద్ద హీరోలు కూడా ఓ హీరో యిన్ ను చూసి భయపడేవారట. ఇంతకీ ఎవరా హీరోయిన్..?   

PREV
16
ఆ హీరోయిన్ భుజంపై చేయి వేయడానికి భయపడిన అక్కినేని నాగేశ్వరావు. కారణం ఏంటి..?

తెలుగు సీనీపరిశ్రమకు  అన్నీ తామే అయ్యారు ఎన్టీఆర్ ఏఎన్నార్. ఇండస్ట్రీ అంతా వారి మాటమీద ఉండేవారు. ఇప్పటికీ తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే. చిన్నా..పెద్దా నటులకు  ఎన్టీఆర్ ఏఎన్నార్ ఆదర్శం  అని చెప్పాలి. ఇక ఏఎన్నార్ తన ఊపిరి ఉన్నంత వరకూ సినిమాకోసమే బ్రతికారు. సినిమానే ఊపిరిగా భావించారు. మరణించేవరకూ నటిస్తూనే ఉన్నారు అక్కినేని నాగేశ్వరావు. 

Also Read:  హీరోయిన్ ను పెళ్లాడబోతున్న నిహారిక మాజీ భర్త, మెగా డాటర్ కు షాక్ ఇచ్చిన చైతన్య ..?

26

ఆయన తన ఫ్యామిలీ అంతటితో కలిసి మనం సినిమా చేసిన కొద్ది రోజులకే చనిపోయారు. అలా సినిమా కోసం బ్రతికిన అరుదైన.. వజ్రం లాంటి నటుడు ఏఎన్నార్. అయితే ఏఎన్నార్ తో నటించడమంటే హీరోయిన్లు ఎవరైనా సరే ఎగిరిగంతేసేవారట. ఆయన సెట్ లో ఉంటే  చాలా జాగ్రత్తగా ఉండేవారట. హీరోయిన్లతో ఏఎన్ ఆర్ చాలా సరదాగా ఉండేవారట. 

Also Read: ఈ సినిమా చేయను, వెళ్ళిపోతాను.. జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ తో గొడవపెట్టుకున్న మూవీ ఏదో తెలుసా..?

36

వారిపై పంచ్ లు వేస్తూ.. ఏదో ఒక చమత్కారాలు ఆడుతూ.. తిడుతూ సరదాగా ఉందేవారట. అయితే ఒక్క హీరోయిన్ అంటే మాత్రం అక్కినేని నాగేశ్వరావు కు చాలా భయమట. ఆమె సెట్ లో ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండేవారట.

ఆహీరోయిన్ తో మాట్లాడాలన్నాభయపడేవారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా భానుమతి. అవును భానుమతి అంటే ఆయనకు ఎందుకు భయంటే.. భానుమతి ఏఎన్నార్ కంటే సీనియర్. 

Also Read:  మెగాస్టార్ తాగిన ఎంగిలి కప్పును దాచుకన్న స్టార్ కమెడియన్, లక్ష ఇచ్చినా అది ఎవరికీ ఇవ్వడట.

46

ఏఎన్నార్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె అక్కినేనిని గైడ్ చేసేవారట.  ఓ కెమెరా ను కూడా కొని ఇచ్చి లోకేషన్లతో పాటు.. కెమెరా అంటే భయం పోయేట్టు చేసిందట. ఇక సినిమాల్లో ఆమెజోడిగా నటించాలన్నా ఏఎన్నార్ చాలా జాగ్రత్తగా ఉండేవారట. ఓ సారి భానుమతి తో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు ఆమె భుజంపై చేయి వేయాల్సి వచ్చిందట. 
 

56
Bhanumathi

అప్పుడు ఆమె కట్టకున్న చీర కూడా చేతికి గుచ్చుకుంటూ.. ఇబ్బందిపెట్టిందట. ఆ విషయం చెప్పలేక.. చాలా ఇబ్బందిపడ్డారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అక్కినేని నాగేశ్వరావు.  90 ఏళ్లు ప్రశాంతంగా.. సినిమాలు చేసుకుంటూ.. తనకునచ్చినలైఫ్ ను గడిపారు ఏఎన్నారు. 
 

66

ఆతరువాత క్యాన్సర్ అటాక్ అవ్వడంతో కొన్నిరోజులు ఇబ్బంది పడ్డారు. ట్రీట్మెంట్ చేయించుకుంటూనే.. పెద్దాయన నిద్రలోనే కన్ను మూశారు. ఏఎన్నార్ మరణం గురించి చెపుతూ.. నాగార్జున ఓ సందర్భంలో ఎమోషనల్ అయ్యారు. 

Read more Photos on
click me!

Recommended Stories