జై భీమ్
తన భర్తకు న్యాయం జరగాలని సెంగెణి న్యాయవాది చంద్రు సాయంతో పోరాడుతుంది. ఈ కేసులో సెంగెణి గెలుస్తుంది. ఈ సినిమాలో రాజా కణ్ణుగా మణికంఠన్, సెంగెణిగా లిజో మోల్ నటించారు.
ఇక అసలైన హీరో పాత్ర న్యాయవాది చంద్రుగా సూర్య నటించగా, రజిషా విజయన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, గురు సోమసుందరం, ఎంఎస్ భాస్కర్, జయప్రకాష్, ఇళవరసు, సుజాత తదితరులు నటించారు.
Also Read: ఈ సినిమా చేయను, వెళ్ళిపోతాను.. జూనియర్ ఎన్టీఆర్ డైరెక్టర్ తో గొడవపెట్టుకున్న మూవీ ఏదో తెలుసా..?
జై భీమ్ లో సూర్య చేసిన తప్పు
ఈ చిత్రానికి ఎస్.ఆర్.కతిర్ ఛాయాగ్రహణం, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ అందించారు. జ్యోతిక, సూర్యలు 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా సమయంలో విడుదలైన ఈ సినిమా అమెజాన్ ఓటీటీలో విడుదలయ్యింది.
ఓటీటీలోప్రేక్షకులను ఆకట్టుకుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా విడుదలైనప్పుడు, ఒక వృద్ధుడి చర్య 'జై భీమ్' సినిమాలో తాను చేసిన తప్పును ఎత్తి చూపిందని, దాని వల్ల తాను బాధపడ్డానని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య చెప్పారు.
సూర్య భావోద్వేగం
'అన్నాత్త' సినిమా చూడటానికి సూర్య థియేటర్‌కి వెళ్ళినప్పుడు, 'జై భీమ్' సినిమాకి వస్తున్న ఆదరణ గురించి తెలుసుకున్న ఒక వృద్ధుడు ఆ సినిమాకి టికెట్ కావాలని టికెట్ కౌంటర్‌లో అడిగాడట. ఆ సినిమా ఓటీటీలో విడుదలైందని చెప్పినప్పుడు, ఆ వృద్ధుడికి అర్థం కాలేదు. అప్పుడు ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడం పెద్ద తప్పు చేశామని బాధపడ్డాడట సూర్య.
ఇక అలాంటి తప్పు చేయకూడదని అనుకున్నానని సూర్య చెప్పారు. థియేటర్లలో రిలీజ్ అయ్యుంటే అందరూ చూసి ఉండేవారు కదా అని సూర్య బాధపడ్డాట. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలతో పాటు.రీసెంట్ గా జరిగిన బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ లో కూడా సూర్య వెల్లడించారట.