సాయి పల్లవి సౌత్ ఇండియాన్ స్టార్ హీరోయిన్ . ప్రేమమ్ సినిమాతో పాపులర్ అయ్యారు. కానీ, అంతకు ముందు కస్తూరి మాన్, ధూమ్ ధామ్ సినిమాల్లో నటించారు. ఆ సినిమాల్లో ఆమె పాత్ర గుర్తింపు రాలేదు. తెలుగులో ఫిదా సినిమాతో ఫిదా చేసిన బ్యూటీ.. వరుసగా ఇక్కడ ఆఫర్లు సాధించింది. నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.
తెలుగు, తమిళ తెరపై వరుస సినిమాలు చేసిన సాయి పల్లవి...నాని, నాగచైతన్య సరసన రిపిట్ కాంబినేషన్ గా ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఇక కథ బాగుంటేనే సినిమా చేస్తాను అంటున్న సాయి పల్లవి.. ఆ నిర్ణయంతో పెద్ద పెద్ద సినిమాలనే వదిలేసింది. కొన్ని సినిమా ఆమె నటించినవి పెద్దగా ఆడలేదు. కొన్ని హిట్అయ్యాయి. రీసెంట్ గా శివకార్తికేయన్ హీరోగా రాజ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన అమరన్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఈ సినిమాలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. 200 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 335 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత ఆమె ఇప్పుడు ఒక తెలుగు, రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.
అవసరమైనతే కోట్లకు పడగలెత్తే సత్తా ఉన్నా.. విలువలు పాటిస్తోంది సాయ పల్లవి. ఎక్కువగా ఎగిరిపడటంలేదు. ఇక ఇప్పుడు, ఎవరికైనా సాయం చేసే స్థాయికి నా దగ్గర డబ్బుంది. ఇదే నాకు దక్కిన ఆశీర్వాదం అనుకుంటుంన్నా అన్నారు సాయి పల్లవి. సాయి పల్లవి ఆస్తుల విలువ దాదాపు 47 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అమరన్ సినిమాకి ఆమె 3 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారట. మరి ఆమె ఏదైనా ఫౌండేషన్ స్టార్ట్ చేస్తారా ఏంటి అని ఆడియన్స్ అడుగుతున్నారు.