
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ చిత్రం ''దేవర''. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్.. ఎన్నో ఎక్సపెక్టేషన్స్ నడుమ సెప్టెంబర్ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటకీ, దానితో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భారీగానే వసూళ్లు రాబట్టి షాక్ ఇచ్చింది. అలాగే సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ ఈ చిత్రాన్ని ముగించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు 'దేవర 2' ఎప్పుడు మొదలవుతుంది అనే డిస్కషన్ చేసుకుంటున్నారు.
దర్శకుడు కొరటాల శివ 'దేవర' పార్ట్-2 స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు దర్శకుడు తన టీమ్ తో గత కొన్ని రోజులుగా వర్క్ చేస్తున్నట్లుగా చెప్పుకొస్తున్నారు. అంతేకాదు వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, షూటింగ్ స్టార్ట్ చేస్తారని అంటున్నారు. అయితే ఇప్పుడు దేవర లో కీలకమైన విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగటంతో ఈ విషయం మరోసారి డిస్కషన్ కు వచ్చింది.
ఇప్పుడు సైఫ్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన కోలుకుని తను కమిటైన ప్రాజెక్టులు ఫినిష్ చేయాలి. ఆ తర్వాత దేవర 2 దగ్గరకు రావాలి. గాయం చాలా తీవ్రంగా తగిలింది కాబట్టి కోలుకోవటానికి చాలా టైమ్ పట్టచ్చు అంటున్నారు. ఈ క్రమంలో దేవర 2 షూటింగ్ ఈ సంవత్సరం జరగకపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. మరో ప్రక్క ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు, అలాగే వార్ 2 సినిమాలు పూర్తి చేయాలి.
దేవర రిలీజ్ తర్వాత కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'దేవర 2'లో వర ఆడే ఆట చాలా కొత్తగా ఉంటుందని, వర వీర విహారం చూస్తారని చెప్పారు. ఇంకా చాలా పెద్ద కథ ఉంది. ఫస్ట్ పార్ట్ జస్ట్ బిగినింగ్ మాత్రమే. సెకండ్ పార్ట్ లో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి. చాలా పాత్రలు వేరే షేప్ తీసుకుంటాయి.
పాత్రల మధ్య డ్రామా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. దేవర, వర మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. దేవర కథలు వింటూ పెరిగిన వర.. అమితంగా ఇష్టపడే తన తండ్రి గుండెల్లోకి ఎందుకు కత్తి దింపాల్సి వచ్చింది?, అంత పెద్ద త్యాగం ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? దేవర గురించి వర ఏం కథ రాసాడు? అసలు దేవరను ఏం చేసాడు? వంటి అంశాలు పార్ట్-2లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని కొరటాల తెలిపారు.
ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఓ గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆరు కత్తిపోట్లకు గురైన సైఫ్.. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు అత్యవసర శస్త్రచికిత్సలు చేశామని, ప్రాణాపాయం ఏమీ లేదని, రెండ్రోజుల్లో నాన్-ఐసీయూ విభాగానికి మారుస్తామని వైద్యులు తెలిపారు.
‘ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన వేగంగా కోలుకుంటున్నారు. సైఫ్ మెళ్లిగా నడుస్తున్నారు. భయపడాల్సిందేమీ పనిలేదు. పెరాలసిస్ రిస్క్ కూడా లేదు. ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కు షిఫ్ట్ చేశాం. అయితే వారం వరకు ఆయన్ను విజిటర్స్ కలవడానికి లేదు. వెన్ను గాయం కారణంగా ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
అందుకే ఎవర్నీ అనుమతించడం లేదు. ఆయన హాస్పిటల్‌లోకి వచ్చినప్పుడు రక్తంతో తడిసిపోయి ఉన్నారు. అయినా సింహంలా నడుచుకుంటూ వచ్చారు. స్ట్రెచర్ కూడా వాడలేదు. ఆయన రియల్ హీరో. సైఫ్ అదృష్టవంతుడు. ఆయన వెన్నులోకి దిగిన కత్తి మరో 2 మిల్లీమీటర్లు లోపలకు వెళ్లి ఉంటే ప్రాణానికే ప్రమాదం వచ్చేది’ అని సైఫ్‌కు చికిత్స అందిస్తున్న లీలావతి హాస్పిటల్ డాక్టర్ నితిన్ నారాయణ్ చెప్పుకొచ్చారు.