ప్రస్తుతం నోరా ఫతేహీ సాంగ్స్ కు భారీగా డిమాండ్ ఉంది. ఆమె 5 నిమిషాల పాటకు దాదాపు 2 కోట్ల వరకూ ఛార్జ్ చేస్తోందట. ఇలానే తన డిమాండ్ పెరగడంతో ఇప్పటి వరకూ 60 కోట్లకు పైగా ఆస్తులు కూడా కూడబెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా డిమాండ్ పెరిగింది.
ఇంట్లోనుంచి పారిపోయి వచ్చి.. ఇండస్ట్రీలో ఈ రేంజ్ లో ఎదగడం అంటే మాటలు కాదు. ఈ స్టార్ డమ్ వెనుక నోరా కష్టం మాత్రమే ఉంది. ఆమె పట్టుదల ఆమెను ఇంత వరకూ తీసుకువచ్చింది. ప్రస్తుతం నార్త్ తో పాటు సౌత్ లో కూడా ఆమెకు డిమాండ్ పెరిగేలా చేసింది.