సాయి పల్లవికి వచ్చిన అలవాటు
'నేను జార్జియాలో చదువుకుంటున్నప్పుడు, ఉదయం 3.30 గంటలకు నిద్రలేచి చదువుకునే అలవాటు ఉండేది. అందుకే నా శరీరం ఈ పద్ధతికి అలవాటు పడింది'.'కాలేజీ అయిపోయిన తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నా తొందరగా నిద్రలేస్తాను. పడుకోవడానికి ప్రయత్నించినా నిద్రపట్టదు. అందుకే ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నిద్రలేచి నా పనులు చేయడం మొదలుపెడతాను' అని చెప్పారు.
Also Read: మోహన్ బాబు బదులు, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో, యముడి పాత్ర మిస్ అయిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?
2025లో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిగా సాయి పల్లవి
ప్రస్తుతం బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న సాయి పల్లవి రణబీర్ కపూర్ సరసన రామాయణం సినిమాలో, అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ సరసన ఒక సినిమాలో నటిస్తోంది. పారితోషికం విషయంలో కూడా నయనతార, సమంతాలను దాటేసి రూ.15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. దీని ద్వారా 2025లో ఎక్కువ పారితోషికం తీసుకునే నటిగా సాయి పల్లవి నిలిచారు.