సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డమ్ తో దూసుకుపోతోంది నయనతార. 40 ఏళ్ళు వచ్చినా ఏమాత్రం అందం తగ్గకుండా ఫిట్ నెస్ ,గ్లామర్ విషయంలో జాగ్రత్తగా మెయింటేన్ చేస్తోంది. ఇక ఇప్పటికీ హీరోయిర్ ఓరియోంటెడ్ పాత్రలు చేస్తున్న ఈ బ్యూటీ, పాన్ ఇండియా స్టార్ హీరోకు అక్కగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ హీరో సినిమాలో నయనత్ నటిస్తోంది. కాని తాజా అప్ డేట్ ప్రకారం స్టార్ హీరోకు అక్కగా ఆమె కనిపించబోతుందట. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో, కెజియఫ్ స్టార్ యష్.
Also Read: మోహన్ బాబు బదులు, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో, యముడి పాత్ర మిస్ అయిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?
కేజీఎఫ్ సినిమా తర్వాత యాష్ నటిస్తున్న సినిమా 'టాక్సిక్'. "టాక్సిక్" కెజియఫ్ తరువాత చాలా గ్యాప్ తీసుకుని చేయడం వల్ల ఈసినిమాపై యష్ ఫ్యాన్స లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈక్రమంలో ఈసినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈమూవీకి సబంధంచిన అప్ డేట్ కూడా వచ్చింది.
2026 మార్చి 19న సినిమా విడుదల అవుతుందని సినిమా టీమ్ పోస్టర్ ద్వారా తెలిపింది. విడుదలకి ముందు, టాక్సిక్ సినిమా నిర్మాతలు దేశవ్యాప్తంగా ప్రమోషన్ టూర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. యాష్ భారతదేశంలోని ముఖ్య నగరాల్లో అభిమానులతో మాట్లాడతారని అంటున్నారు. ఇక ఈసినిమాలో నయనతార ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. హీరో యష్ కు అక్కడగా ఆమె నటిస్తుందని అంటున్నారు.
Also Read:షూటింగ్ పూర్తయిన, రిలీజ్ ఆగిపోయిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కెరీర్ లోనే విడుదల అవ్వని ఏకైక మూవీ.
టాక్సిక్ మూవీ విడుదల తేదీ
ఈ టూర్లో పెద్ద ఫ్యాన్ మీటింగ్ ఈవెంట్లు కూడా ఉంటాయని అంటున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ లాంటివి పెద్ద ఈవెంట్లుగా విడుదల చేస్తారని సమాచారం. ఇంగ్లీష్ తో పాటు కన్నడలో కూడా సినిమా తీస్తున్నారు. టాక్సిక్ సినిమాని ప్రపంచ సినిమా అనుభవంగా మార్చడానికే ఈ ప్రయత్నం. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం సహా చాలా భారతీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమా డబ్ చేస్తారు.
Also Read: విజయ్ దళపతి Vs శివ కార్తికేయన్, బాక్సాఫీస్ పోరుకి సై అంటున్న స్టార్ హీరోలు
టాక్సిక్ మూవీ పూజ స్టిల్స్
కీతు మోహన్ దాస్ రాసి డైరెక్ట్ చేస్తున్న యాష్ "టాక్సిక్" సినిమా మిక్స్డ్ కల్చర్ కథ చెప్పే పద్ధతిలో వస్తోంది అని అంటున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, యాష్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న టాక్సిక్ సినిమా ఒక ప్రపంచ సినిమా అనుభవంగా ఉంటుందని సినిమా టీమ్ చెబుతోంది. బాక్స్ ఆఫీస్ స్టార్ యాష్, సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ సహా చాలా అంతర్జాతీయ వేదికల్లో అవార్డులు గెలుచుకున్న కీతు మోహన్ దాస్ కలిసి పని చేస్తుండడంతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Also Read:సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో కీలక మలుపు, సీబీఐ రిపోర్ట్ లో ఊహించని ట్విస్ట్!
టాక్సిక్ మూవీ
జాన్ విక్, ఫాస్ట్ & ఫ్యూరియస్ సినిమాల్లో పని చేసిన జేజే పెర్రీ యాక్షన్ సీన్స్, టున్ 2 స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ సహకారం సినిమాకి ఇంటర్నేషనల్ క్వాలిటీని ఇస్తుంది. జనవరిలో యాష్ పుట్టినరోజున "టాక్సిక్" ప్రపంచానికి ఒక లుక్ అనే పేరుతో యాష్ "బర్త్ డే విజన్" సినిమా టీమ్ విడుదల చేసింది. టీజర్ ఉత్సాహాన్ని రేపింది. సినిమా షూటింగ్ 2024 ఆగస్టులో మొదలైంది.