నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెకెకుతోన్న 'రామాయణం' భారతదేశంలోనే భారీ బడ్జెట్ సినిమాగా నిలవనుంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అయితే, సీతగా సాయి పల్లవి ఎంపిక ఇప్పుడు వివాదానికి దారితీసింది.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ మూవీగా రామాయణం తెరకెక్కుతోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈమూవీ ఈ ఏడాది, వచ్చే ఏడాది దివాళి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.
25
హిందీ రాదంటూ సాయి పల్లవిపై ట్రోలింగ్
ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. అయితే, సీతగా సాయి పల్లవి ఎంపిక ఇప్పుడు వివాదానికి దారితీసింది. హిందీ సరిగ్గా మాట్లాడటం రాని సాయి పల్లవిని సీత పాత్రకు ఎందుకు ఎంపిక చేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు దర్శకుడు నితీష్ తివారీని ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు.
35
సాయి పల్లవికి సపోర్ట్ గా అభిామానులు..
సాయి పల్లవిపై వస్తున్న విమర్శలను కొందరు తిప్పికొడుతున్నారు. నటనకు భాష ముఖ్యం కాదని, అసలు రామాయణం సంస్కృతంలో ఉందని, హిందీతో సమస్య ఏంటని ప్రశ్నిస్తున్నారు. సాయి పల్లవికి ఈ విషయంలో అభిమానులు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.
గతంలో రాముడి పాత్రకు రణబీర్ కపూర్‌ను ఎంపిక చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. మాంసాహారం తినే వ్యక్తిని రాముడిగా ఎలా ఎంపిక చేస్తారని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
55
875 కోట్ల భారీ బడ్జెట్..
ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్‌తో పాటు హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ పనిచేస్తుండటం అంచనాలను పెంచుతోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 875 కోట్లు అని అంచనా.