Samantha Top 5 Hits: సమంత కెరీర్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపిన టాప్ 5 సినిమాలు.. తిరుగులేని స్టార్ ని చేసింది ఇవే

Published : Apr 28, 2026, 05:49 PM IST

Samantha Top 5 Hits: సమంత త్వరలో బిగ్‌ స్క్రీన్‌ పై మెరవబోతుంది. అయితే సమంత కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్టయిన చిత్రాలు చాలా ఉన్నాయి. వాటిలో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలేంటో  చూద్దాం. 

PREV
16
అనేక సవాళ్లని ఫేస్ చేసి స్టార్‌గా ఎదిగిన సమంత

తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో సమంత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నా, నటనను మాత్రం వదల్లేదు. ఆ తర్వాత విడాకులు, మయోసైటిస్ వ్యాధితో బాధపడటం వంటి ఎన్నో సవాళ్లను దాటుకుని ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. మరి ఆమె కెరీర్‌లో అత్యధిక వసూళ్లు చేసిన 5 సినిమా లిస్ట్ చూస్తే. 

26
పుష్ప: ది రైజ్

2021లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ అయినా, 'ఊ అంటావా మావా' ఒక్క పాటతో సమంత దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. హీరోయిన్‌కి మించిన క్రేజ్‌ ఇందులో సమంతకి ఈ పాట ద్వారా వచ్చిందంటే అతిశయోక్తి కాదు.  అల్లు అర్జున్‌తో సమానంగా అభిమానులు సమంతకు కటౌట్లు పెట్టి సెలబ్రేట్ చేశారు. ఈ సినిమా రూ.365 కోట్లకు పైగా వసూలు చేసింది.

36
రంగస్థలం

2018లో వచ్చిన 'రంగస్థలం' పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కింది.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో, సమంత రామలక్ష్మి పాత్రలో అద్భుతంగా నటించారు. ఇది సమంత కెరీర్‌లో  మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.214 కోట్లు వసూలు చేసింది.

46
తెరి
2016లో తమిళంలో వచ్చిన 'తెరి' సినిమాకు అట్లీ దర్శకత్వం వహించారు. విజయ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో, సమంత మిత్ర అనే డాక్టర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.150-160 కోట్ల వరకు వసూలు చేసింది.
56
మహానటి

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 2018లో వచ్చిన ఈ సినిమా, దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించినప్పటికీ, సమంత పాత్రకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం రూ.85 నుంచి 90 కోట్ల వరకు వసూళ్లు సాధించింది.

66
ఏ మాయ చేశావే

సమంత సినీ కెరీర్‌కు పునాది వేసిన సినిమా 'ఏ మాయ చేశావే'. ఈ చిత్రంతోనే ఆమె హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించారు. తమిళ 'విన్నైతాండి వరువాయా'కు ఇది తెలుగు వెర్షన్. ఈ సినిమా రూ.30 నుంచి 35 కోట్ల వరకు వసూలు చేసింది. నేడు సమంత 39వ పుట్టిన రోజుని సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం `మా ఇంటి బంగారం` చిత్రంతో రాబోతుంది. త్వరలోనే ఇది రిలీజ్‌ కానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories