Kiara Advani: 7 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు దారుణం.. కియారా అద్వానీ అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందా?

Published : Apr 28, 2026, 06:41 PM IST

బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఓ బ్రాండ్ షూటింగ్ సెట్‌లో దారుణమైన సంఘటన జరిగింది. కియారాపై ఓ దాడి జరిగింది. అప్పుడు ఆమె బాడీగార్డ్ జీషన్ ఖురేషీ అడ్డుపడి కాపాడారు. ఈ షాకింగ్ నిజాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టారు. 

PREV
14
రంగుల ప్రపంచం వెనుక షాకింగ్ నిజం!

వెండితెరపై తారలు మెరుస్తుంటే మనకు కనిపించేది లైట్స్, కెమెరా, వాళ్ల వైభోగం మాత్రమే. కానీ ఆ రంగుల ప్రపంచం వెనుక కొన్నిసార్లు ఒళ్లు గగుర్పొడిచే చేదు నిజాలు ఉంటాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బాడీగార్డ్ జీషన్ ఖురేషీ చెప్పిన ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. కియారా ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఆ భయంకరమైన క్షణం గురించి వింటే షాక్ అవుతారు!

24
కియారా మీదకు దూసుకొచ్చిన వ్యక్తి...

స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు షూటింగ్ సెట్‌లో జరిగింది ఈ సంఘటన. అప్పుడు కడుపులో బిడ్డతో.. 7 నెలల గర్భిణిగా కియారా షూటింగ్ కు వచ్చారు. షూటింగ్ ముగించుకుని తన వ్యానిటీ వ్యాన్ నుంచి కిందకు దిగుతున్నప్పుడు ఊహించని సంఘటన ఎదురైంది. ఓ కార్పొరేట్ కంపెనీ టీమ్‌కు చెందిన ఒక వ్యక్తి, చూడటానికి చాలా పద్ధతిగా సూట్ వేసుకుని ఉన్నాడు. 

కానీ కియారాని చూడగానే అతను తన కంట్రోల్ కోల్పోయాడు. ఎవరూ ఊహించని విధంగా ఆ వ్యక్తి ఉన్నట్టుండి కియారా వైపు దూసుకొచ్చి, ఆమెను బలవంతంగా కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు! ఏడు నెలల గర్భిణిగా ఉన్న నటికి ఈ ఆకస్మిక దాడితో పెద్ద షాక్ తగిలింది. ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియక అందరూ నిశ్చేష్టులయ్యారు.

34
కియారాను కాపాడింది ఎవరు?

అయితే, కియారా నీడలా ఉండే ఆమె బాడీగార్డ్ జీషన్ ఖురేషీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే మధ్యలో దూరి, ఆ వ్యక్తి కియారాని తాకకముందే అతన్ని అడ్డుకుని పక్కకు నెట్టేశారు. ఆ వ్యక్తి ఓ పెద్ద కంపెనీ టీమ్‌కు చెందినవాడైనా, కియారా భద్రతే ముఖ్యమని జీషన్ భావించారు. "జనాలు ఎంత చదువుకున్నా, ఎంత పద్ధతిగా కనిపించినా, సెలబ్రిటీలను చూసినప్పుడు ఒక్కోసారి మృగాల్లా ప్రవర్తిస్తారు" అని జీషన్.ఆవేదనగా చెప్పారు. ఈ గొడవ ఎంత పెద్దదైందంటే, చివరికి ఆకాష్ అంబానీ మేనేజర్ కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది.

44
భార్య కోసం సిద్ధార్థ్ పాట్లు

కియారా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఎంత ఆందోళన చెందారో కూడా జీషన్ బయటపెట్టారు. మొదట్లో కియారా షూటింగ్ కు వెళ్లడం సిద్ధార్థ్‌కు ఇష్టం లేదట. భార్య భద్రత గురించి ఆయన చాలా కంగారు పడ్డారు. షూటింగ్‌కు వెళ్లే ముందు సిద్ధార్థ్ స్వయంగా జీషన్‌కు ఫోన్ చేసి, "ఆమె తోనే ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి, ఎలాంటి లోపం రాకూడదు" అని ఒకటికి పదిసార్లు జాగ్రత్తలు చెప్పారట.'షేర్షా' సినిమా సెట్‌లో మొదలైన వీరి ప్రేమకథ 2023లో పెళ్లితో సుఖాంతమైంది. గత ఏడాది జులైలో ఈ జంటకు 'సరయా' అనే చిన్నారి పుట్టింది. అప్పుడు ఎదురైన ఆ చేదు అనుభవాన్ని మరిచిపోయి, ఇప్పుడు ఈ స్టార్ జంట తమ కూతురితో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories