Devatha: ఇల్లు వదిలి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్న రుక్మిణి.. సత్యకు దేవుడమ్మ సలహా!

First Published Oct 19, 2022, 12:43 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 19వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..దేవుడమ్మ, సత్య ఎక్కడికి వెళ్ళదు కదా ఒకవేళ వెళ్ళినా సరే నాకు చెప్పేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచనలో పడుతూ ఉంటుంది. అప్పుడు భాష, అవును సత్య మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు కదా అని అంటాడు.ఇంతలో సత్య, ఆదిత్యలు వేరు వేరు కారులలో ఇంటికి వస్తారు. ఎక్కడికి వెళ్లారు ఇద్దరు వేరువేరుగా వచ్చారు ఎందుకని అడగగా ఆదిత్య మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూసారా వీళ్ళ పరిస్థితి ఇలాగ ఉన్నది అని దేవుడమ్మ అంటుంది.
 

 ఆ తర్వాత సీన్లో రుక్మిణి తన గదిలో కూర్చొని ఏడుచుకుంటూ జరిగిన విషయం అంతా గుర్తుతెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడు భాగ్యమ్మ అక్కడికి వచ్చి ఏమైందమ్మా? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు ఆ మాధవ్ గాడు నిన్ను ఏమైనా అన్నాడా చెప్పు అని అనగా, మాధవ్ కాదు పెనిమిటి అన్నారు సత్య కూడా నన్నే అంటుంది నేను ఏదో తప్పు చేసినట్టు అని అక్కడ జరిగిన విషయం అంతా భాగ్యమ్మకి చెప్తుంది రుక్మిణి. అప్పుడు భాగ్యమ్మ, పటేల్ ఏదో కోపంతో అని ఉంటారు ఇంక సత్య విషయానికొస్తే తను చూసింది మాత్రమే నిజం అనుకుంటుంది. 
 

నువ్వు ఆ మాటలేం పట్టించుకోవద్దు అమ్మ అని అంటుంది. అప్పుడు రుక్మిణి,  లేదు నేను ఇప్పటివరకు దేవిని వాళ్ళింటికి అప్పచెద్దామనుకున్నాను పదేళ్ళు వరకు నేను దేవిని పెంచాను ఇప్పుడు నాకు దేవి భారం అయిపోదు నేను దేవిని నాతోనే ఉంచుకుంటాను చచ్చేంత వరకు ఇదేనా నిర్ణయం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో ఆదిత్య తన జీవితంలో సత్యతో కాలేజ్ రోజుల్లో జరిగిన విషయాల నుంచి మొన్న దేవితో జరిగిన విషయాలు వరకు అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు.
 

 అసలు ఈ అక్క చెల్లెల మధ్య నేను నలిగిపోయాను. వీళ్ళిద్దరి వల్ల ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితి వస్తుంది దేవుడా అంటూ బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత సీన్లో రుక్మిణి జానకమ్మ దగ్గరికి వస్తుంది. అప్పుడు జానకమ్మ బీరువా వైపు చూపిస్తూ కళ్ళతో సైగలు చేస్తుంది. బీరువా తెరిచేసరికి లోపల బంగారు అంతా ఉంటుంది. అప్పుడు రుక్మిణి జానకమ్మ దగ్గరికి వచ్చి హద్దుకొని మీరు నా కోసం ఎంత ఆలోచిస్తున్నారు ఇంక నేను నిర్ణయించుకున్నాను నేను దేవిని పట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అలాగని మీకు దూరంగా ఉంటానని కాదు.
 

నాకు మీరు ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చారు మీ కొడుకుని కూడా వద్దనుకొని నా గురించి ఆలోచించారు. మీరు చేసిన దానికి నేను ఏమి ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలి అని అంటుంది. అంతలో భాగ్యమ్మ అక్కడికి వస్తుంది. నేను దేవి ని తీసుకొని వెళ్తున్నాను మీకు నయం అయ్యేవరకు మా అమ్మ మీతోనే ఉంటుంది అని భాగ్యమని చూపిస్తుంది రుక్మిణి.అప్పుడు జానకమ్మ,రుక్మిణి మాటలు విని ఆశ్చర్య పోతుంది. అవును ఈవిడే మా అమ్మ అని రుక్మిణి అంటుంది.భాగ్యమ్మ జానకమ్మతో, ఇన్నాళ్లు నా బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు మీకు రుణపడి ఉంటాను అమ్మా. మీ గురించి నేను చూసుకుంటాను అని అనగా జానకమ్మ ఆనందపడి బంగారం తీసుకొని వెళ్ళు అన్నట్లు సైగలు చేస్తుంది. 

అప్పుడు రుక్మిణి, వద్దమ్మా నేను బంగారం తీసుకోను నేను నా కాళ్ళ మీద నిలబడి దేవమ్మను పెంచగలను నాకు మీ ఆశీర్వాదాలు ఉంటే చాలు అని జానకమ్మ కాళ్ళ మీద పడుతుంది రుక్మిణి. అప్పుడు జానకమ్మ కష్టపడుతూ తన చేతిని రుక్మిణి తల మీద పెడుతుంది.అప్పుడు రుక్మిణి ఎంతో ఆనందపడుతుంది.ఆ తర్వాత సీన్లో జరిగిన విషయం అంత గుర్తు తెచ్చుకుంటూ సత్య ఆలోచనలలో పడుతుంది. సత్య అలా ఉండడం చూసి దేవుడమ్మ సత్య దగ్గరికి వస్తుంది. నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అని నేను అడగను అమ్మ ఎందుకంటే అడిగినా మీరు నాకు ఏమి సమాధానం చెప్పరు. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను గుర్తు పెట్టుకో మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే మన మనసు మాత్రం ప్రశాంతంగా ఉండాలి. బురద మధ్య కలవ పువ్వు లాగా మనం ఎప్పుడూ మెరుస్తూనే ఉండాలి. 

మనకి ఒకరితో మనస్పర్ధలు వస్తున్నాయి అంటే మనం వాళ్ళ మీద ప్రేమను చూపిస్తున్నాము అని అర్థం. మీ అక్క రుక్మిణి నీకోసం ఈ జీవితాన్ని వదిలి వెళ్ళిపోయింది. నువ్వు, ఆదిత్య ప్రేమించుకుంటున్నారు అని విషయం తెలియక నేను పెళ్లి చేసినా సరే తను నీకోసం తన జీవితాన్ని త్యాగం చేసింది అలాంటి త్యాగానికి నువ్వు న్యాయం చేయాలి అని అంటుంది. దానికి సత్య మనసులో, ఆ త్యాగమే ఇప్పుడు నాకు శాపంగా మిగిలింది అని అనుకుంటుంది. అప్పుడు దేవుడమ్మ సత్యతో, మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అలా బయటకు గుడికి వెళ్లి వద్దాము అని అనగా సత్య సరే అంటుంది. ఆ తర్వాత సీన్లో చిన్మయి దేవి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది.

అప్పుడు రుక్మిణి అక్కడికి వచ్చి ఏమైందమ్మా దేవిని పిలుస్తున్నావు అని అనగా, అమ్మ దేవి నాకు ఇందాక నుంచి కనబడడం లేదు ఇల్లంతా వెతికాను ఎక్కడ కనబడట్లేదు అని కంగారుగా అంటుంది. దానికి రుక్మిణి దేవమ్మ కనిపించకపోవడం ఏంటి రా నేను వెతుకుతాను అని ఇద్దరు కలిసి ఇల్లంతా వెతుకుతారు. దేవి ఎక్కడా కనిపించదు అప్పుడు రుక్మిణి, ఎప్పుడూ ఇంట్లోనే ఉండేది కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అని అనగా చిన్మయి భయంతో, అమ్మ కిందటిసారి ఇల్లు వదిలి పారిపోయినట్టే ఇప్పుడు వెళ్లి ఉంటుందా అని అనగా రుక్మిణి,  దేవి మాటలు గుర్తు తెచ్చుకొని కంగారుపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!