ఎన్టీఆర్ పెద్ద ఫజిల్, ఆర్ ఆర్ ఆర్ లో ఫైట్స్ కన్నీళ్లు తెప్పిస్తాయి...గూస్ బంప్స్ కలిగిస్తున్న రైటర్ అప్డేట్స్!

First Published May 25, 2021, 12:08 PM IST

స్టార్ రైటర్, దర్శకధీరుడు రాజమౌళి తండ్రిగారైన విజయేంద్ర ప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో ఆర్ ఆర్ ఆర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే ఆయన ఎన్టీఆర్ నటన గురించి తన అభిప్రాయం తెలియజేశారు. 
 

ఎన్టీఆర్ గురించి మీరు ఏమి చెబుతారు అని యాంకర్ అడుగగా.... ఎన్టీఆర్ గురించి మాట్లాడే స్థాయికి నేను ఎదుగుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. స్టూడెంట్ నంబర్ వన్ మూవీలో ఎన్టీఆర్ నటన చూశాక.. తాత ఎన్టీఆర్ ఎంత పెద్ద స్థాయికి వెళ్లారో, ఎన్టీఆర్ కూడా ఆ స్థాయికి వెళతారని నాకు అనిపించింది అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
undefined
తారక్ లో బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటని తదుపరి ప్రశ్నగా యాంకర్ అడిగారు. దానికి సమాధానంగా తారక్ షాట్ రెడీ అయ్యేవరకు సెట్స్ లో ఆడుకుంటూ, అల్లరి చేస్తూ, అందరితో మాట్లాడుతూ ఉంటాడు. షాట్ రెడీ కాగానే, కెమెరా ముందుకు వెళ్లిన ఎన్టీఆర్ కంప్లీట్ డ్రమటిక్ మూడ్ లోక్ వెళ్ళిపోతారు. సింగిల్ షాట్ లో అద్భుతంగా డైలాగ్ చెబుతాడు. హోమ్ వర్క్ లేకుండానే ఇంత బాగా చేస్తే ప్రిపరేషన్ ఉంటే ఇంకా బాగా చేయగలడా అనే సందేహం కలుగుతుంది. అందుకే ఎన్టీఆర్ సమాధానం లేని ఓ ఫజిల్.. అన్నారు విజయేంద్ర ప్రసాద్.
undefined
మీ సినిమాలు కాకుండగా తారక్ నటించిన చిత్రాలలో మీకు నచ్చినది ఏదని యాంకర్ విజయేంద్ర ప్రసాద్ ని అడిగారు. సినిమాల పరంగా అన్నీ నచ్చుతాయి. మా సినిమాలలో పాటు మిగతా సినిమాలలో కూడా ఎన్టీఆర్ దాదాపు ఒకే షేడ్ రోల్స్ చేశాడు. కానీ వి వి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన అదుర్స్ మూవీలో ఆయన చారి అనే కామెడీ రోల్ చేశారు. అది నాకు  బాగా నచ్చిన రోల్. ఇప్పటికి కూడా మనసు విసుగుగా ఉంటే చారి కామెడీ ట్రాక్ చూసి రిఫ్రెష్ అవుతానని ఆయన చెప్పారు.
undefined
ఎన్టీఆర్ ని ఎలాంటి పాత్రలో చూడాలని అనుకుంటున్నారని మరో ప్రశ్నగా అడగడం జరిగింది. ఎన్టీఆర్ రౌద్ర రసం, శృంగార రసం, హాస్య రసం తన సినిమాలలో పండించారు. అయితే అన్నింటి కంటే గొప్ప రసం కరుణ రసం. ప్రేక్షకులను చేత కన్నీరు పెట్టించగలగడం గొప్ప విషయం. అది ఎన్టీఆర్ బాగా చేయగలడని నా నమ్మకం. ఆ తరహా చిత్రంలో ఎన్టీఆర్ నటించాలని కోరుకుంటున్నాను. ఉదాహరణగా భజరంగీ భాయ్ జాన్ మూవీ పేరు చెప్పారు ఆయన.
undefined
చివరిగా ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుందని అడిగిన ప్రశ్నకు సమాధానం వింటే గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. సాధారణంగా సినిమాలలో ఫైట్స్ చూస్తూ ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు కొడతారు. దానికి భిన్నంగా ఆర్ ఆర్ ఆర్ లో ఫైట్స్ చూస్తుంటే కన్నీరు పెట్టుకుంటారు. అంత గొప్పగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉంటుందని ఆయన తన మాటలలో తెలిపారు.
undefined
click me!