Nithiin Sreeleela Robinhood movie Trailer released in telugu
Robinhood Twitter Review: నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రాబిన్ హుడ్. ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాంబోతుండగా.. ఈమూవీ ప్రీమియర్స్ చూసిన అబిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరి వారేమంటున్నారంటే?
Also Read: రూ. 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా మహారాణిలా లైఫ్ లీడ్ చేస్తోన్న హీరోయన్ ఎవరు?
రాబిన్ హుడ్ సినిమాకు వివాదాలతో ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. కావాలని చేశారా? లేక అలా జరిగిపోయిందా తెలియదు కాని. అది దా సర్ ప్రైజ్ పాటతో కేతిక శర్మ ఓ వివాదం రాజేసింది. ఆ పాట ఓవర్ బోల్డ్ నెస్ పై విమర్శలు వచ్చాయి, వాటితో పాటు వ్యూస్ కూడా వచ్చాయి. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను రాజేంద్ర ప్రసాద్ సరదాగా తిట్టడం మరోవివాదానికి దారితీసింది. ఆతరువాత ఆయన వివరణ ఇచ్చాడు. కాని ఈలోపు ఈ వివాదం వల్ల సినిమా బాగా పాపులర్ అయ్యింది.
Also Read: రామ్ చరణ్ ను పట్టించుకోని అల్లు అర్జున్, మరోసారి బయటపడ్డ విభేదాలు. అసలేం జరుగుతోంది?
ఇక యూకేలో ఈసినిమా ప్రీమియర్లు చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యాయిన మరో నెటిజన్ అంటున్నాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ మూవీ చాలా బాగుందట. సినిమా హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు. అయితే చాలా మంది ఈసినిమా మ్యూజిక్ పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ ఎందుకు ఇంత దారుణమైన మ్యూజిక్ ఇచ్చారో అర్ధం కావడంలేదు అంటున్నారు.మ్యూజిక్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ అంటున్నారు.
ఇక ఈసినిమాపై నెగెటీవ్ రివ్యూస్ కూడా ఉన్నాయి ట్వీట్టర్ లో.. రాబిన్ హుడ్' ఫస్టాఫ్ పర్వాలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ వల్ల సినిమా సేవ్ అవుతుందేమో అని అన్నాడో మరో నెటిజన్. అసలు ఈసినిమా గురించి చెప్పుకోడానికి ఏమీ లేదంటున్నాడు. ఇక పాటల గురించి అసలు అడగొదంటూ ట్వీట్ చేశాడు. కామెడీ వర్కౌట్ అయిందని, రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ కాంబో నవ్వించిందన్నారు మరో నెటిజన్. ఇక . శ్రీలీల ఎపిసోడ్ మాత్రం క్రింజ్ అని కామెంట్ చేశాడు.
Robinhood grand trailer
డేవిడ్ వార్నర్ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తూ సినిమా చూడాల్సి వచ్చిందన్నారు మరో నెటిజన్. నితిన్, శ్రీ లీల జంట నటన పరవాలేదని టాక్ వచ్చింది. డేవిడ్ వార్నర్ సీన్స్ మాత్రం సినిమా అంతా చూడటం కోసం క్లైమాక్స్ లో పెట్టినట్టు అనిపించింది అన్నారు మరో నెటిజన్. అంతే కాదు డేవిడ్ వార్నర్ నటన మాత్రంఅందరిని నవ్విస్తుందంటూ ట్వీట్ చేశారు. ఇలా ఈసినిమాపై రకరకాల కామెంట్లు నెటింట్లో దర్శనం ఇచ్చాయి. మరి మూవీ ఫైనల్ గా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.