Ram Charan and Allu Arjun
Allu Arjun Ignores Ram Charan Birthday: చాలా కాలంగా మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎవరూ ఈ విషయంలో బయట పడటంలేదు కాని, వీళ్లు చేసే పనులు మాత్రం వీరిమధ్య గ్యాప్ ఉంది అని తెలిసేలా చేస్తున్నాయి. ఇప్పుడే కాదు గత కొంత కాలంగా మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం గురించి చర్చ జరుగుతూనే ఉంది. కాని కొన్ని సందర్భాల్లో మాత్రం అందరు కలిసిపోయినట్టే చేస్తుండటం విచిత్రంగా అనిపిస్తుంది.
Also Read:
అయితే ఈ గ్యాప్ రామ్ చరణ్ , అల్లు అర్జున్ మధ్య మాత్రమే అని కొన్ని సంఘటనలు తెలిసేలా చేస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కాని, అల్లు అరవింద్ మధ్య ఎప్పుడు ఏ విషయంలో మనస్పర్ధలు కాని, మాట్లడుకోకపోవడం లాంటివి కనిపించలేదు. ఏ కార్యక్రమం అయినా ఇద్దరు పాల్గొనాల్సిన చోట మిస్అవ్వకుండా కనిపిస్తుంటారు. కాని రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్యే గ్యాప్ స్పస్టంగా కనిపిస్తుంది. తాజాగా ఇది మరోసారి రుజువు అయ్యింది.
Also Read: చిరంజీవి ముద్దు పేరుతో పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? మెగాస్టార్ తో చనువున్న ఏకైక నటి?
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ అందరు సోషల్ మీడియా వేదికగా గ్లోబల్ స్టార్ కు శుభాకాంక్షలు తెలిపారు. కాని అల్లు అర్జున్ మాత్రం చరణ్ బర్త్ డేను పట్టించుకోలేదు. ఏ సెలబ్రిటీకి సంబంధించిన అకేషన్ అయినా విష్ చేయడం మర్చిపోని అల్లు అర్జున్, రామ్ చరణ్ బర్త్ డేకు కనీసం విష్ చేయకపోవడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ విషయంలో వీరిమధ్య విభేదాలు మళ్ళీ బయటపడ్డాయంటున్నారు సినీ జనాలు.
Also Read: సావిత్రిని టికెట్ లేదని ట్రైన్ నుంచి దిగిపొమ్మన్న టీసి. మహానటిని కాపాడిన హీరోయిన్ ఎవరు?
ఇటు చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య మంచి అనుబంధం ఉంది. అటు అల్లు అర్జున్ తన మేనత్తను చాలా అభిమానిస్తాడు. రామ్ చరణ్ కూడా తన మేనమామ అరవింద్ అంటే చాలా ఇష్టం అంటారు. తనతో సరదాగా ఉండాలన్నా.. పార్టీలు పబ్ లకు వెళ్లాల్సి వస్తే.. అరవింద్ మామాతోనే వెళ్తాను..అని ఓ ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ చెప్పారు. దాంతో అంతా బాగానే ఉన్నారు కాని చరణ్ బన్నీల మధ్యే ఎందుకు ఈ గ్యాప్ అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
Also Read: రూ. 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా మహారాణిలా లైఫ్ లీడ్ చేస్తోన్న హీరోయన్ ఎవరు?
Allu Arjun Pawan Kalyan Ram charan
ఆంధ్రా ఎలక్షన్స్ టైమ్ లో తన బాబాయ్ కి సపోర్ట్ చేస్తూ.. రామ్ చరణ్ పిఠాపురం వెళ్తే.. వీళ్లకు వ్యాతిరేక వర్గం అయిన వైసీపీ అభ్యర్ధి శిల్పా రవికి సపోర్ట్ గా అల్లు అర్జున్ వెళ్ళారు. తన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి వెళ్ళానని బన్నీ అనడం, అప్పటి నుంచి ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తూనే ఉంది. దానికి తోడు బన్నీ మధ్యలో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వివాదాన్ని మరింతగా రెట్టించాయి. కాని ఈ విషయాలలో రామ్ చరణ్ మాత్రం ఎప్పుడూ నోరు తెరవలేదు.
దాంతో వీరి మధ్య గ్యాప్ అనేది అప్పుడు కూడా బయటపడింది. ఈ వియం మనసులో పెట్టుకునే చరణ్ బర్త్ డేకు అల్లు అర్జున్ విష్ చేయలేదా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. గత ఏడాది మొక్కుబడిగా అయినా బర్త్ డే విష్ చేసిన బన్నీ.. ఈసారి అది కూడా చేయకపోవడం ఫ్యాన్స్ లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ వస్తుంది, ఈ ఇద్దరు స్టార్లు కలిసే రోజు ఎప్పుడు వస్తుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ram charan allu arjun
ఇక ఆమధ్య సంధ్య థియేటర్ ఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ జైలుకు వెళ్తే.. చిరు, నాగబాబు అరవింద్ ఇంటికి వెళ్ళిమరీ పరామర్శించారు. దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అందుకు కృతజ్ఞతగా బన్నీ చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్ళి మరీ థ్యాంక్స్ చెప్పి వచ్చాడు. కాని ఈ ఎపిసోడ్ మొత్తంలో సెలబ్రిటీలు అందరు అల్లు అర్జున్ విషయంలో స్పందించారు. కాని రామ్ చరణ్ మాత్రం బన్నీతో మాట్లాడినట్టు కాని, సోషల్ మీడియాలో స్పందించినట్టు కాని ఎటువంటి వార్త రాలేదు. స్పందించలేదు కూడా.