`వీర ధీర శూర` మూవీ రివ్యూ, రేటింగ్.. విక్రమ్‌కి ఈ సారైనా హిట్ పడిందా?
విక్రమ్ హీరోగా నటించిన `వీర ధీర శూర` మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
విక్రమ్ హీరోగా నటించిన `వీర ధీర శూర` మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
విలక్షణ నటుడు విక్రమ్ నటుడిగా నిరూపించుకుంటున్నారు. కానీ కమర్షియల్ హిట్ పడటం లేదు. ఇటీవల చాలా సినిమాలు డిజప్పాయింట్ చేస్తున్నాయి. చివరగా చేసిన `తంగలాన్` కూడా డిజప్పాయింట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్యాన్స్ కోసం కమర్షియల్ మూవీ `వీర ధీర శూర` చేశాడు. దీనికి ఎస్ యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు.
ఇందులో విక్రమ్‌కి జోడీగా దుస్సరా విజయన్ నటించగా, ఎస్ జే సూర్య, సూరజ్, 30 ఇయర్స్ పృథ్వీ కీలక పాత్రలు పోషించారు. హెచ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై రియా షిబు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ విడుదల చేశారు. అయితే పలు ఫైనాన్స్ సమస్యల కారణంగా ఈ మూవీ గురువారం(మార్చి 27)న ఉదయం రిలీజ్ కాలేదు. అన్ని సమస్యలు సెట్ చేసుకుని ఈవినింగ్ విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉంది? విక్రమ్ కి ఈ సారైనా హిట్ దొరికిందా? అనేది చూడాలి.
కథః
పెద్దాయన, రవి(పృథ్వీరాజ్) ఇంటికి ఓ లేడీ వస్తుంది. తన భర్త కనిపించడం లేదని, మీరే కిడ్నాప్ చేశారని వారితో గొడవ పెట్టుకుంటుంది. దీంతో పెద్దాయన కొడుకు కన్నన్(సూరజ్) ఆమెని కొడతాడు. కాసేపటికే ఆమె అదృశ్యమవుతుంది. దీంతో ఆమె భర్త ఎస్పీ(ఎస్ జే సూర్య) వద్దకు వెళ్తాడు. తన భార్య కనిపించడం లేదని, పెద్దాయన ఇంటికి వెళ్లిందని చెబుతాడు.
దీన్ని ఆసరాగా చేసుకుని ఎస్పీ.. పెద్దాయన, కన్నన్ ఎన్ కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఈ విషయం పెద్దాయన, కన్నన్‌కి తెలుస్తుంది. దీంతో రాజీకి పెద్దాయన వెళ్లినా ప్రయోజనం లేదు. ఆ సమయంలో కాళి(విక్రమ్)ని పిలవాల్సి వస్తుంది. కాళి గతాన్ని వదిలేసి దూరంగా వేరే ఊర్లో కిరాణా షాపు నడిపిస్తూ భార్యతో హ్యాపీగా ఉంటాడు.
పెద్దాయన ఆయన వద్దకు వెళ్లి తనకు సహాయం చేయాలని, కన్నన్ ప్రాణాలను కాపాడాలని కాళ్లమీద పడతాడు. దీంతో భార్య వాణి(దుసరా విజయన్)ని కాదని వెళ్తాడు. ఎస్పీని చంపడానికి బయలు దేరతాడు. మరి ఎస్పీని కాళి చంపాడా? కాళి గతం ఏంటి? దిలీప్ ఎవరు? ఆయన్ని పోలీసులు ఎందుకు చంపేశారు. కాళికి, పెద్దాయనకు ఉన్న సంబంధం ఏంటి? ఎస్పీ ఆడిన గేమ్‌లో పెద్దాయన, కన్నన్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? కాళి ఇచ్చిన కౌంటర్ ట్విస్ట్ ఏంటనేది మిగిలిన కథ.
విశ్లేషణః
ఇటీవల రా అండ్ రస్టిక్ మూవీస్ బాగా ఆడుతున్నాయి. మాస్ కమర్షియల్ అంశాలను జోడించి ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా, ట్విస్ట్ ల, టర్న్ లు, ఎలివేషన్లతో తెరకెక్కిస్తే మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. అందులో భాగంగా విక్రమ్ కూడా ఫ్యాన్స్ ని ఖుషీ చేసేందుకు, తాను కమ్ బాక్ కోసం `వీర ధీర శూర` మూవీలో నటించారు. ఈ మూవీ కార్తి `ఖైదీ`ని తలపిస్తుంది.
ఒక రోజు రాత్రి జరిగే కథ. ఒక్క రాత్రిలో అటు పోలీసులు పెద్దాయన, ఆయన కొడుకు కన్నన్‌ని చంపేయాలని ప్లాన్ చేస్తే, ఎస్పీనే చంపేయాలని పెద్దాయన, కన్నన్ ప్లాన్ చేస్తాడు. రాత్రినే కథ ముగించాలని బయలు దేరతాడు కాళి. వీరు వేసే స్కెచ్‌ల సమాహారం, ఒకరి నుంచి ఒకరు బయటపడేందుకు చేసే ప్రయత్నాలు, వాళ్లని చంపేసేందుకు కాళీ పడే కష్టం ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలే ఈ మూవీ కథ.
ఆద్యంతం స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ ఇది. కథనాన్ని ఎంతటి ఉత్కంఠభరితంగా, ఎంతటి ఎంగేజింగ్‌గా నడిపించామనేది ముఖ్యం. ఈ మూవీ విషయంలో దర్శకుడు అదే ఫాలో అయ్యాడు. కానీ చాలా లాజిక్కులు వదిలేశారు. సినిమాని బాగా స్లోగా నడిపించారు. ఎంతసేపు కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది.
అర్థరాత్రి నుంచి మార్నింగ్ వరకు కథనాన్ని నడిపించడం పెద్ద టాస్కే. అందుకోసం సాగదీతని ఎంచుకున్నట్టు అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం ల్యాగ్ గా అనిపిస్తుంది. అదే సమయంలో మూవీ మొత్తం ఊహించినట్టుగానే సాగుతున్నట్టు అనిపిస్తుంది. మధ్య మధ్యలో ట్విస్ట్ లు ఆశించినా అవి నిరాశనే మిగిల్చుతాయి.
సినిమా మొత్తం అక్కడక్కడే సాగుతుంది. అదే సమయంలో ఎవరు ఎవరిని చంపాలపుకుంటున్నారు? అనేది పెద్ద కన్ ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కథలో చాలా విషయాలను సస్పెన్స్ లో పెట్టారు. దిలీప్ పాత్రని చూపించలేదు. దీనికి మరో కథ ఉందని అర్థమవుతుంది. చాలా విషయాలను సరిగ్గా చూపించలేదు. దీంతో ఏం జరుగుతుందో క్లారిటీ మిస్ అయ్యింది.
సినిమా చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. కానీ ఇందులో హీరో ఎవరు? విలన్ ఎవరు? అనేది పెద్ద సమస్యగా మారింది. ఒక్కో పాత్ర ఒక్కో సందర్భంలో ఒక్కోలా ప్రవర్తిస్తారు. మన అనుకునే వాళ్లు శత్రువులుగా మారారు. శత్రువులు మనగా మారతారు. ప్రాణభయంతో ఎవరైనా ఒకే దాటికి వస్తారనేది నిజం. ఇందులోనూ అదే చూపించారు.
ఎస్పీ, కాళి, కన్నన్ ఎదురుపడినప్పుడు కాళి ఎవరి వైపు ఉన్నాడనేది ఆసక్తికరంగా మారింది. అదే కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ నెలకొంటుంది. కానీ ఆ స్థాయిలో సన్నివేశాలు లేకపోవడంతో కొంత డిజప్పాయింట్ గా ఉంటుంది. క్లైమాక్స్ వరకు సింపుల్‌గా సాగుతుంది. ట్విస్ట్ లు, టర్న్ లు పెద్దగా లేకపోవడంతో కావాల్సిన కిక్ మిస్ అయ్యింది.
కానీ క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ వాహ్ అనిపిస్తుంది. కానీ అది ఆడియెన్‌కి సరిపోదు. సినిమాలో ఏది హీరోయిజం, ఏది విలనిజం అనేది స్పష్టత లేదు. దర్శకుడు ఏదో చేయబోయి, ఇంకేదో చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనం విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుని, ట్విస్ట్ లు జోడించి కాస్త మరింత ఉత్కంఠభరితంగా మూవీని తెరకెక్కించే ఉంటే బాగుండేది.
నటీనటులుః
కాళి పాత్రలో విక్రమ్ అదరగొట్టాడు. తనదైన యాక్టింగ్‌తో మెప్పించారు. కాళి పాత్రలో జీవించారు. పాత్రని రక్తికట్టించాడు. అదే సమయంలో డీసెంట్‌గా బిహేవ్ చేస్తూ ఆకట్టుకున్నారు. కావాల్సిన ఎలివేషన్లకు ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ నటుడిగా ఆయన దుమ్ములేపాడని చెప్పొచ్చు. ఆయన భార్య పాత్రలో దుసరా విజయన్ సైతం అంతే సహజంగా చేసింది. అందరి దృష్టిని ఆకర్షించింది.
కన్నన్ పాత్రలో సూరజ్ బాగా చేశాడు. మరో హైలైట్ అయ్యే పాత్ర అయనది. ఇరగదీశాడు. ఇక పెద్దాయన రవి పాత్రలో పృథ్వీరాజ్ నటన కూడా ఆకట్టుకుంది. మనకు ఆయన కమెడియన్‌గా తెలుసు. దీంతో విలన్‌గా చూడలేకపోతున్నాం. ఆ పాత్రకి ఇంకా ఎలివేషన్లు, బాక్ స్టోరీ ఉంటే బాగుండేది. ఎస్పీగా ఎస్ జే సూర్య సినిమాకి మరో పెద్ద అసెట్. ఆయన చేసిన రచ్చ వేరే లెవల్ అని చెప్పొచ్చు.
ఇందులో ఎస్పీగా ఎత్తులకు పై ఎత్తులు వేసే వ్యక్తిగా సూర్య దుమ్ములేపాడు. పాత్రకి ప్రాణం పోశాడు. హీరోని డామినేట్ చేసే పాత్రలో ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ లో ఆయన పాత్రని డమ్మీ చేశారనిపిస్తుంది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయని చెప్పండి.
టెక్నీషియన్లుః
టెక్నీకల్‌గా సినిమా బాగుంది. ముఖ్యంగా తేని ఈశ్వర్ కెమెరా వర్క్ వేరే లెవల్. బాగా షూట్ చేశారు. ప్రసన్న జీకే ఎడిటింగ్ ఇంకా కత్తెరకు పనిచెప్పాల్సింది. సినిమా చాలా స్లోగా రన్ అవుతుంది. ఆ విషయంలో కొంత కేర్ తీసుకోవాల్సింది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. అతి లౌడ్‌గా వెళ్లకుండా థ్రిల్లర్ మిక్స్ చేసి ఆయన ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది.
దర్శకుడు అరుణ్ ఈ మూవీని రెండు పార్ట్ లుగా తీసుకురావాలనుకున్నారు. కానీ ఇప్పుడు రెండో పార్ట్ ని ముందుగా విడుదల చేశారు. ఫస్ట్ పార్ట్ ఈ మూవీ రిలీజ్ అయితే ఉంటుంది. దీంతో ఇందులో కథ సరిగా చెప్పలేదు. అదే కన్‌ఫ్యూజన్‌కి కారణమవుతుంది. ఈ విషయంలో మరింత గ్రిప్పింగ్‌గా కథనాన్ని రాసుకుంటే బాగుంటుంది.
ఫైనల్‌గాః ఆడియెన్స్ సహనాన్ని పరీక్షించే `వీర ధీర శూర`. తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకోవడం కష
రేటింగ్‌ః 2.25