అప్పుడు కనిపించకుండా తాళిని లోపల దాచుకుంటుంది వసుధార. మరొకవైపు మహేంద్ర, జగతి ఇద్దరు కారులో వస్తుండగా అప్పుడు మహేంద్ర ఇంకా ఎంత దూరం వెళ్లాలి జగతి అని అంటాడు. దగ్గరికి వచ్చేసాము మహేంద్ర అని అంటూ చక్రపాణి అన్న మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది జగతి. మరొకవైపు రిషి టెన్షన్ గా వసుధార దగ్గరికి బయలుదేరుతాడు. మరొకవైపు దేవయానికి, రాజీవ్ ఫోన్ చేసి మరి కొద్ది సేపట్లో వసుధారకి నాకీ పెళ్లి జరగబోతోంది అని అనగా ఆజా భజంత్రీలు సౌండ్ వినిపించలేదు అని దేవయాని అనడంతో ఇది సైలెంట్ గా జరిగే పెళ్లి మేడం జి అనగా కంగ్రాచ్యులేషన్స్ అని చెబుతుంది దేవయాని. అప్పుడు దేవయాని నువ్వు మొదట వసుధార మెడలో తాళిబొట్టు కట్టు ఆ తర్వాత కట్నాలు కానుకలు అన్ని నేను పంపిస్తాను కదా అని అంటుంది.