బిగ్ బాస్ లోకి రిషి ‌- వసుధార..? అందుకే గుప్పెడంత మనసు సీరియల్ కు శుభం కార్డ్ వేశారా..?

First Published | Aug 16, 2024, 11:16 AM IST

తెలుగు సీరియల్ ప్రియులకు షాకింగ్ న్యూస్ తో పాటు ఓ గుడ్ న్యూస్ కూడా.. గుప్పెడంత మనసు సీరియర్ అయిపోతుంది అని బాధపడుతున్న ప్యామిలీ ఆడియన్స్ కు.. ఇప్పుడు పండగలాంటి వార్త అందుతోంది...? 

Guppedantha Manasu

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడవారు.. ముఖ్యంగా సీరియల్ ప్రియులకు రిషి,వసుధారల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఫేమస్ అయిన  ఈ ఇద్దరు కన్నడతారలకు.. తెలుగులో స్టార్ హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. గుప్పెడంత మనసు సీరియల్ చూడకుండా ఉండలేనివారు ఎందరో ఉన్నారు. ఇక ఈసీరియల్ కు శుభం కార్డ్ వేయబోతున్నారని తెలిసి.. ఎంతో బాధపడుతున్నారు ఆడియన్స్. ఇంత సడెన్ గా ఎందుకు ఆపేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 

All So Read: ఎన్టీఆర్ క్లాప్ తో.. మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్..? నందమూరి ఫ్యాన్స్ కు పండగే పండగా..
 

Guppedantha Manasu

జగతీ అలియాస్ జ్యోతీరాయ్... రిషి తల్లిగా నటించిన ఈమె సీరియల్ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో.. అప్పటి నుంచి ఈ సీరియల్ కు రేటింగ్ చాలా వరకు తగ్గింది. ఇక ఆమధ్యలో రిషీ కూడా కొన్నాళ్లు సినిమా షూటింగ్స్ వల్ల ఈసీరియల్ కు దూరం అవ్వడంతో.. ఫ్యాన్స్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక చాలా రోజుల తరువాత రిషి ఎంట్రీ ఇచ్చాడు అనుకున్న టైమ్ కు .. ఈసీరియల్ క్లోజ్ అవుతుంది అని తెలుసుకుని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. రిషివచ్చి ఎక్కువ రోజులు కావడంలేదు అప్పుడే ఏమయ్యింది అని ప్రశ్నిస్తున్నారు. 

All So Read: శోభితకు నాగార్జున కండీషన్లు...? చైతును పెళ్ళాడాలంటే అవి తప్పనిసరిగా చేయాల్సిందేనా..?


కాగా ఈ సీరియల్ కుశుభం కార్డ్ వేయడానికి ఓ పెద్ద రీజనే ఉన్నట్టు తెలుస్తోంది. అదేదో కాదు. ఈ సీరియల్ ద్వారా బాగా ఫేమస్అయిన రిషి ‌- వసుధారలను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో  వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. గుప్పెడంత మనసు సీరియల్ కు సడెన్ గా  ముగింపు పలకడానికి కారణం బిగ్ బాస్ అని అనుకుంటున్నారు. ఈ సీరియల్లో రిషి పాత్రలో నటించిన ముఖేష్ గౌడ, వసుధార పాత్రలో నటించిన  రక్షిత గౌడ ఇద్దరూ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్ నడుస్తుంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ కూడా వినిపిస్తోంది. 

All So Read: పెద్ద సినిమా పెద్ద సినిమా అన్నాడు.. రాజమౌళి ఇలా చేస్తాడనుకోలేదు.. ప్రభాస్ అలా అన్నాడేంటి..?

రిషి, వసుధార వీరిద్దరు ఒకే బిగ్ బాస్ షోలోకి రావడం లేదట. చాలామంది వీరు తెలుగు బిగ్ బాస్ కు వస్తారేమో అనుకుంటున్నారు. అయితే కన్నడ ఇండస్ట్రీకి చెందిన వీరు.. తెలుగులోనే బాగా పాపులర్ అయ్యారు. అయితే కన్నడ బిగ్ బాస్ రియాల్టీ షోలోకి రిషి అలియాస్ ముఖేష్ గౌడ వెళ్తుండగా.. తెలుగు బిగ్ బాస్ షోలోకి వసుధార అలియాస్ రక్షిత గౌడ కంటెస్టెంట్ గా వెళ్తుందని టాక్ వినిపిస్తుంది.

All So Read: రజినీకాంత్ మాటలకు షాక్ అయిన అల్లు అర్జున్, ఏదో అనుకుంటే మరేదో అయ్యింది..?

అయితే ఇది అధికారికంగా కన్ ఫార్మ్ అవ్వలేదు. నిజమెంతో కూడా తెలియదు. కాని సోసల్ మీడియా మాత్రం ఈ విషయంలో కోడై కూస్తోంది. కాని  ఈ ఇద్దరు తారలకు కన్నడలో కంటే.. తెలుగులోనే పాపులారిటీ ఎక్కువగా ఉంది. తెలుగు ఫ్యాన్స్ రిషి మీద ఎక్కువ ప్రేమను చూపిస్తుంటారు. ఈ ప్రచారంలోనిజం ఉండి ఉంటే.. రిషి తెలుగు బిగ్ బాస్ లోకి వస్తేనే బాగుంటుంది.. ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అనేది ఆడియన్స్ అభిప్రాయం. 

అంతే కాదు తెలుగు బిగ్ బాస్ లోకి రిషి వస్తే.. విన్నర్ గా నిలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎక్కువ ఓటింగ్ కూడా పడుతుంది. ఇప్పటికే రిషికీ...ముఖేష్ గౌడ పేరుతో ఆర్మీ ఉంది.. ఫ్యాన్ బేస్ అకౌంట్లు కూడా ఉన్నాయి. దాంతో బిగ్ బాస్ కు.. ఇవి కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Latest Videos

click me!