డబుల్‌ ఇస్మార్ట్, మిస్టర్‌ బచ్చన్‌, తంగలాన్‌లకు ఆయ్‌ షాక్‌.. ఈ వారం వచ్చిన చిత్రాల్లో ఏది హిట్‌, ఏది ఫ్లాప్‌?

First Published | Aug 16, 2024, 11:16 AM IST

ఈ గురువారం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. భారీ పోటీ మధ్య రిలీజ్‌ అయిన ఈ చిత్రాల్లో ఏ మూవీ హిట్‌, ఏది ఫ్లాప్‌ అనేది చూస్తే..
 

ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని ఈ వారం నాలుగు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. ఇందులో మూడు పెద్ద సినిమాలుండగా, ఒక చిన్న చిత్రం ఉంది. దాన్ని పెద్ద బ్యానర్‌ నిర్మించడం విశేషం. ఈ గురువారం విడుదలైన వాటిలో రవితేజ `మిస్టర్‌ బచ్చన్‌`, రామ్‌ `డబుల్‌ ఇస్మార్ట్`, విక్రమ్‌ `తంగలాన్‌` చిత్రాలతోపాటు ఎన్టీఆర్‌ బామ్మర్ది నితిన్‌ నార్నే నటించిన `ఆయ్‌` చిత్రాలున్నాయి. మరి వీటిలో ఏది హిట్‌, ఏది ఫట్‌ అనేది చూస్తే..
 

తెలుగులో ప్రధానంగా మాస్‌ మహారాజా రవితేజ నటించిన `మిస్టర్‌ బచ్చన్‌` హైప్‌తో వచ్చింది. దర్శకుడు హరీష్‌ శంకర్‌ చేసిన రచ్చ కారణంగా దీనికి కాస్త హైప్‌ వచ్చింది. కానీ గురువారం విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమైంది. బాలీవుడ్‌ హిట్‌ మూవీ `రైడ్‌`కిది రీమేక్‌. తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో హరీష్‌ విఫలమయ్యాడు. ఫస్టాఫ్‌ అంతో ఇంతో నడిపించాడు, కానీ సెకండాఫ్‌ని ఆకట్టుకునేలా డీల్‌ చేయలేదు. రవితేజ లాంటి స్టార్‌ హీరోని పట్టుకుని కుప్పిగంతులు ఆడిన ఫీలింగ్‌ తెప్పించింది. మొత్తంగా ఇది ఫస్ట్ నుంచే నెగటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా డల్‌గానే ఉన్నాయని ట్రేడ్‌ వర్గాల సమాచారం. 
 

Latest Videos


ఇక రామ్‌, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన `ఇస్మార్ట్ శంకర్‌` పెద్ద హిట్‌ అయ్యింది. సుమారు వంద కోట్లు చేసింది. దీంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన `డబుల్‌ ఇస్మార్ట్` పై అంచనాలున్నాయి. భారీ బిజినెస్‌ కూడా జరిగింది. కానీ స్వాతంత్ర దినోత్సవం కానుకగా విడుదలైన ఈ మూవీకి కూడా నెగటివ్‌ టాక్‌ వచ్చింది. డబుల్‌ రాడ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హంగామా తప్ప సినిమాలో మ్యాటర్‌ లేదనే టాక్‌ వినిపించింది. అయితే ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం బాగానే ఉన్నాయని తెలుస్తుంది. అవి ఎంత వరకు నిలబడతాయనేది చూడాలి. ఎందుకంటే ఈ వారం లాంగ్‌ వీకెండ్‌, సెలవులు ఉన్నాయి. ఇవి `డబుల్‌ ఇస్మార్ట్` కి కాస్త హెల్ప్ అవుతుందంటున్నారు. కానీ హిట్‌ కావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 

దీంతోపాటు డబ్బింగ్‌ మూవీ `తంగలాన్‌` వచ్చింది. విక్రమ్‌ హీరోగా పా రంజిత్‌ తెరకెక్కించిన చిత్రమిది. మాళవిక మోహనన్‌, పార్వతి కీలక పాత్రలు పోషించారు. పీరియడ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించుకుంటుంది. అయితే తమిళ ఫ్లేవర్‌ ఉండటంతో ఇది తెలుగు ఆడియెన్స్ కి ఎంత వరకు ఎక్కుతుందనేది డౌట్‌.  కానీ సినిమాగా ఇది కంటెంట్‌ ఉన్న మూవీనే. దాన్ని సరళంగా అందరికి అర్థమయ్యేలా చెబితే సినిమా పెద్ద రేంజ్‌కి వెళ్లేది. కానీ తమిళ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్‌గా ఇది యావరేజ్‌గానే నిలుస్తుంది. సినిమా సాధారణ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేదాన్ని బట్టి ఈ మూవీ ఫలితం ఆధారపడి ఉంది.
 

వీటితోపాటు చిన్న సినిమా `ఆయ్‌` వచ్చింది. ఎన్టీఆర్‌ బామ్మర్ది నితిన్‌ నార్నే నటించిన చిత్రమిది. కొత్త దర్శకుడు అంజి రూపొందించగా, గీతా ఆర్ట్స్ (జీఏ2)లో నిర్మించబడింది. కరోనా నేపథ్యంలో విలేజ్‌లో ఉన్న కుర్రాళ్ల కథ. విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లవ్‌ స్టోరీ, ఫన్‌, ఫ్రెండ్‌షిప్‌ బెస్డ్ గా మూవీ సాగుతుంది. ఫ్రెష్‌ కంటెంట్తో రూపొందించిన చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. ఫన్‌ వర్కౌట్‌ కావడంతో ఫర్వాలేదనిపిస్తుంది. అంతేకాదు ఈ మూవీ మిగిలిన మూడు చిత్రాలకు ఝలక్‌ ఇస్తుందని చెప్పొచ్చు. హిట్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  
 

click me!