ఈ వారం రిలీజ్ లు ...ఏ OTT లో..ఎప్పటినుంచి?

First Published | Aug 16, 2024, 10:17 AM IST

 చాలా మంది ఈ వీకెండ్ కు ఈ రెండు సినిమాల్లో ఒక దానికైనా వెళ్దామనుకుని , టాక్ చూసి ఓటిటిలో చూద్దాములే అని ఫిక్స్ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఏ ఓటిటిలో ఈ సినిమాలు రాబోతున్నాయో చూద్దాం.

Double Ismart and Ravi teja Mr. Bachchan


మాస్ మహారాజ రవితేజ, ఉస్తాద్ రామ్ పోతినేని గురువారం తమతమ లేటెస్ట్ సినిమాలతో భాక్సాఫీస్ దగ్గర పోటీ పడిన సంగతి తెలిసిందే.  లాంగ్  హాలీడే కావటంతో ఇద్దరూ తమ సినిమాలపై మంచి హోప్స్ పెట్టుకున్నారు. అదే విధంగా  ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ ఇద్దరు హీరోలు సక్సెస్ అయ్యారు. తొలి రోజు ఈ రెండు చిత్రాలు దాదాపు 70శాతం ఆక్యుపెన్సీతో రన్ అయ్యాయి. అయితే రెండు సినిమాలకు నెగిటివ్ టాక్ రావటం ఇబ్బందే అని చెప్పాలి. దాంతో చాలా మంది ఈ వీకెండ్ కు ఈ రెండు సినిమాల్లో ఒక దానికైనా వెళ్దామనుకుని , టాక్ చూసి ఓటిటిలో చూద్దాములే అని ఫిక్స్ అవుతున్నారు. ఈ నేపధ్యంలో ఏ ఓటిటిలో ఈ సినిమాలు రాబోతున్నాయో చూద్దాం. 


రవితేజ హీరోగా యంగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన 'మిస్టర్ బచ్చన్' బుధవారం సాయంత్రం నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ క్రమంలో మూవీ డిసెంట్ కలెక్షన్లే వసూల్ చేసింది.   మిస్టర్ బచ్చన్ మూవీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తో డీల్ కుదుర్చుకుంది. ఈ సినిమాకు తొలి షో నుంచే నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దాంతో ఈ మాస్ ఎంటర్టైనర్ నాలుగు వారాల తర్వాత అంటే వచ్చే నెల మూడో వారంలో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 


Double Ismart


రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఆరేళ్ల కిందట వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు  సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ భారీ అంచనాల మధ్య రిలీజైంది. అయితే ఈ  సినిమాకు కాస్త నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి.  అయితే 'డబుల్ ఇస్మార్ట్' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా డే 1 కలెక్షన్లలో జోరు ప్రదర్శించింది. అత్యధికంగా ఈ చిత్రం మ్యాట్నీ షో 73.29శాతం ఆక్యుపెన్సీతో రన్ అయ్యింది. ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా నెలలోగా వస్తుందని అంటున్నారు. 

తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన ఈ తంగలాన్ మూవీ చాలా రోజుల పాటు ఊరించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తంగలాన్ ట్రైలర్, పాటలు చూసినవారికి ఈ సినిమా కథ ఏంటి అనేది అర్థమయ్యే ఉంటుంది. కర్ణాటకకి చెందిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో పని చేసిన కార్మికుల నిజ జీవితాల ఆధారంగా ఈ సినిమాను తీశారు. కేజీఎఫ్ అసలు కథను చెప్పబోతున్న ఈ సినిమాలో విక్రమ్ తన లుక్ తోనే ఆకర్షించాడు. ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. ఈ చిత్రం  ఓటీటీ హక్కులు నెట్‌ఫ్లిక్స్ సొంతమయ్యాయి. ఈ సినిమా ఓటిటిలోకి రావటానికి టైమ్ పడుతుందంటున్నారు. 

Raghu Thatha Movie


కేజీఎఫ్‌’, ‘కాంతార’, ‘సలార్‌’ వంటి పాన్‌ ఇండియా చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘రఘు తాతా’. సుమన్‌ కుమార్‌ దర్శకుడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫార్సీ’ వంటి హిట్‌ వెబ్‌ సిరీస్‌లకు కథా రచయితగా ఆయన పని చేశారు. తాజాగా ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ లాంచ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. కీర్తి సురేశ్ నటించిన మూవీ రఘు తాతా. ఈ సినిమా కూడా గురువారం (ఆగస్ట్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మూవీకి టాక్ బాగో లేదు. ఈ మూవీ జీ5 ఓటీటీలోకి రానుంది. నెల లోపే ఓటిటిలోకి వస్తుందని చెప్తున్నారు 


బాలీవుడ్ భామ శ్ర‌ద్దా క‌పూర్ (Shraddha Kapoor), రాజ్ కుమార్ రావుతో కాంబినేషన్‌లో వచ్చిన తాజా సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ ‘స్త్రీ 2’ (Stree 2). అమర్‌ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో కామెడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ గురువారం (ఆగ‌ష్టు 15న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌లైంది. ఓపెనింగ్‌ డేన సూపర్ హిట్‌ మౌత్‌ టాక్‌తో స్క్రీనింగ్‌ అవుతూ టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ నటించిన ఈ హిందీ హారర్ కామెడీ మూవీ ఆరేళ్ల కిందట వచ్చిన స్త్రీ కంటే కూడా బాగుందంటూ రివ్యూలు వస్తున్నాయి. ఈ మూవీ రెండు నెలల తర్వాత ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా 45 రోజుల తర్వాతే ఓటిటిలోకి రాబోతుందని తెలుస్తోంది. 


బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్, తాప్సీ పన్ను ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న తాజా చిత్రం ‘ఖేల్ ఖేల్ మే’. ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. కామెడీ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఓ మంచి హిట్ కోసం చూస్తున్న అక్షయ్ కుమార్ కు ఈ ఖేల్ ఖేల్ మేతో అది దొరికినట్లే కనిపిస్తోంది. ఈ కామెడీ మూవీ తొలి రోజే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకుంది.ఈ సినిమా సైతం 45 రోజులు తర్వాతే ఓటిటిలోకి వస్తుంది. 
 

Latest Videos

click me!