పవన్‌ కళ్యాణ్‌ కోసం మేకప్‌ లేకుండా నటించిన రేణు దేశాయ్‌.. ఆయనతో ఫేవరేట్‌ సీన్‌ వెల్లడించిన మాజీ భార్య

Published : Jun 16, 2025, 11:37 PM IST

పవన్‌ కళ్యాణ్‌, రేణు దేశాయ్‌ కలిసి మొదట `బద్రి` చిత్రంలో నటించారు. ఇందులో రేణు దేశాయ్‌ మేకప్‌ లేకుండా నటించిందట. దానికి కారణం ఏంటో చెప్పింది పవన్‌ మాజీ భార్య. 

PREV
16
తరచూ వార్తల్లో నిలుస్తున్న రేణు దేశాయ్‌

రేణు దేశాయ్‌.. పవన్ కళ్యాణ్‌ మాజీ భార్యగా బాగా పాపులర్‌. వీరిద్దరు చాలా ఏళ్ల క్రితమే విడిపోయిన విషయం తెలిసిందే. కానీ తరచూ తన ఇంటర్వ్యూలతో వార్తల్లో నిలుస్తోంది రేణు దేశాయ్‌. తన కొడుకు అకీరా, కూతురు ఆధ్య గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది. అదే సమయంలో తన పర్సనల్‌ విషయాలను కూడా ఆమె షేర్‌ చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆమె పవన్‌ కళ్యాణ్‌తో కలిసి నటించిన సినిమా గురించి ఓపెన్‌ కావడం విశేషం.

26
`బద్రి`తోనే పవన్‌, రేణు దేశాయ్‌ల మధ్య ప్రేమ

రేణు దేశాయ్‌.. పవన్‌ కి భార్య కావడానికి ముందు ఆమె కూడా హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. పూరీ జగన్నా‌థ్‌ దర్శకత్వంలో రూపొందిన `బద్రి` చిత్రంతో ఆమె తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పవన్‌కి జోడీగా నటించింది. 

ఇద్దరు హీరోయిన్లు ఉన్న ఈ చిత్రంలో రేణు దేశాయ్‌తోపాటు అమీషా పటేల్‌ మరో హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. ఇందులోని పవన్‌ మ్యానరిజం బాగా వైరల్‌ అయ్యాయి. యూత్‌ దాన్ని ఫాలో అయ్యారు కూడా. పవన్‌ కళ్యాణ్‌కి, రేణు దేశాయ్‌ కి మధ్య ప్రేమ పుట్టింది ఈ చిత్రంతోనే.

36
పవన్‌తో విడిపోయాక ఒంటరిగానే ఉంటోన్న రేణు దేశాయ్‌

`బద్రి` సినిమా సమయంలో పవన్‌, రేణు దేశాయ్‌ల మధ్య ఏర్పడి స్నేహం ప్రేమగా మారింది. కొన్నాళ్ల సహజీవనం అనంతరం పెళ్లి వరకు వెళ్లింది. అయితే పెళ్లికి ముందే అకీరానందన్‌కి జన్మనిచ్చారు ఈ జంట. పెళ్లి తర్వాత ఆధ్య జన్మించారు. కానీ 2012లో ఈ ఇద్దరు విడిపోయారు. 

ప్రస్తుతం ఒంటరిగానే ఉన్న రేణు దేశాయ్‌.. కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆధ్యల స్టడీస్‌, వారి బాగోగులు చూసుకుంటోంది. వారికోసమే ఆమె రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. అయితే భవిష్యత్‌లో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని తెలిపింది రేణు దేశాయ్‌.

46
మేకప్‌ లేకుండా నటించిన రేణు దేశాయ్‌

యూట్యూబర్‌ నిఖిల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది రేణు దేశాయ్‌. `బద్రి` సినిమా సమయంలో చోటు చేసుకున్న సంఘటనని ఆమె బయటపెట్టింది. ఈ మూవీలోని బంగాళా ఖాతంలో అనే పాటని చిత్రీకరించే సమయంలో తాను మేకప్‌ లేకుండా నటించిందట. 

ఈ పాటని ఒకబోట్‌ పై షూట్‌ చేయాల్సి ఉంది. అయితే ఆ రోజు మరో హీరోయిన్‌ అమీషా పటేల్‌ పై షూట్‌ ఉంది. కానీ ఆమె ఫ్లైట్‌ డిలే అయి రాలేకపోయింది. దీంతో ఆరోజు వేస్ట్ అవుతుందని భావించిన టీమ్ రేణు దేశాయ్ తో చేయాల్సి వచ్చిందట. 

అయితే షెడ్యూల్‌ ప్రకారం తనకు ఆ రోజు షూట్‌ లేదు. దీంతో ఆమె రిలాక్స్ గా ఉంది. తన మేకప్‌ ఆర్టిస్ట్ కూడా లేరు. ఆమెకి ఫోన్‌ చెప్పడానికి ఫోన్‌ సిచ్ఛాఫ్‌ అయ్యింది. వెంటనే షూట్‌ అంటే అంతా అయోమయం. ఎలా చేయాలనే డైలామా కొనసాగింది.

56
పవన్‌ కళ్యాణ్‌ని ఆడుకున్న రేణు దేశాయ్‌

అమీషా పటేల్‌ ఆ రోజు షూటింగ్‌కి రాలేకపోవడంతో పవన్‌, తనపై బోట్‌ సీన్‌ చిత్రీకరించారట. ఆ సమయంలో తాను మేకప్‌ లేకుండానే నటించిందట. బోట్‌ సీన్‌ మొత్తం తాను మేకప్‌ లేకుండానే నటించినట్టు తెలిపింది రేణు దేశాయ్‌. అంతేకాదు అందులోనూ తాను ఎప్పటికీ మర్చిపోలేని సన్నివేశాన్ని కూడా పంచుకుంది.

 ఇందులో రేణు దేశాయ్‌, అమీషా పటేల్‌ ఇద్దరూ పవన్‌ని ఇష్టపడతారు. రేణు దేశాయ్‌ ఓ రింగ్‌ కొని పవన్‌కి గిఫ్ట్ గా ఇస్తుంది. కానీ దాన్ని అమీషా పటేల్‌కి ఇస్తాడు పవన్. అది రేణు చూస్తుంది. అప్పట్నుంచి పవన్‌ని ఆటపట్టిస్తూనే ఉంటుంది. హోటల్ లో వాళ్లని కుదురుగా ఉండనివ్వదు. 

ఇక వెళ్లిపోతుంటే తాను ఇచ్చిన రింగ్‌ అమీషా పటేల్‌ పెట్టుకోవడం చూసి, `వాహ్‌ ఈ రింగేంటండి ఇంత బాగుంది. వెరీ వెరీ నైస్‌ అంటుంది రేణు. దీనికి అమీషా పటేల్‌ ఆయన గిఫ్ట్ ఇచ్చాడని పవన్‌ని చూపిస్తుంది. ఇది చూసిన పవన్‌ ఇబ్బంది పడతాడు. తాను ఇరుక్కుపోయానని ఫీలవుతాడు.

66
రేణు దేశాయ్‌ ఎప్పటికీ మర్చిపోలేని `బద్రి` సీన్‌

ఇక ఆ తర్వాత పవన్‌ వద్దకు వెళ్లి `ఎంత బాగుంది సార్‌ మీ టేస్ట్. ఫెంటాస్టిక్‌ అని ప్రశంసలు కురిపిస్తుంది. అంతేకాదు తలపై చేతితో గన్‌ పేల్చినట్టు పేలుస్తుంది` దీంతో అమీషా పటేల్‌ని తన కారులో ఎక్కించుకుని వెళ్లిపోతాడు పవన్‌. అయితే ఈ సీన్‌ మాత్రం తాను ఎప్పటికీ మర్చిపోలేని సీన్‌ అని, అది చాలా ఫన్నీగా ఉంటుందని తెలిపింది రేణు దేశాయ్‌. 

పవన్‌ కళ్యాణ్‌తో రేణు దేశాయ్‌ `బద్రి`తోపాటు `జానీ` చిత్రంలో నటించారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రేణు దేశాయ్‌ సినిమాలు మానేసింది. చాలా ఏళ్ల తర్వాత ఇటీవల రవితేజ `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories