
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న `రాజాసాబ్` మూవీ టీజర్ విడుదలైంది. విజువల్ వండర్‌గా ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. టీజర్‌లో ఒక రాజమహల్ కోట(హవేలీ సెట్) హైలైట్‌గా నిలిచింది. విజువల్ గానూ అది అదిరిపోయేలా ఉంది.
సినిమా మొత్తం ఆ కోటలోనే సాగుతుందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. అదే సమయంలో దర్శకుడు మారుతి కూడా ఈ విషయాన్ని చెప్పారు. హీరోహీరోయిన్లని ఆ కొంపలో పడేశామని, అక్కడే రొమాన్స్, అక్కడే హర్రర్ ఉంటుందని ఆయన వెల్లడించారు. దీంతో డార్లింగ్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసేది ఆ కోటలోనే అని అర్థమవుతుంది.
తాజాగా ఈ కోట సెట్‌ని ప్రత్యేకంగా మీడియాకి చూపించింది టీమ్. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. సెట్ లోపల ఎలా ఉందో చూపిస్తూ `రాజాసాబ్` చిత్ర బృందం ఫోటోలను విడుదల చేసింది. ఇది చూడ్డానికి ఆద్యంతం కనువిందుగా ఉంది.
రెండు ఫ్లోర్స్ లో రాజభవనాన్ని తలపిస్తుంది. టీజర్‌లోనూ ఈ రాజమహల్‌ని హైలైట్ చేశారు. కొన్ని కోట్లు వెచ్చించి ఈ రాజమహల్ సెట్ ని నిర్మించారట ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నంబీయార్. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ భారీ హవేలీ సెట్ గురించి సరికొత్త విషయాలను పంచుకుంది టీమ్. 41,256 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ రికార్డ్ స్థాయి హవేలీ సెట్ ను రూపొందించారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మరే హర్రర్ మూవీకి ఇంత భారీ సెట్ నిర్మించలేదు.
`రాజా సాబ్` హవేలీ సెట్ గురించి ఆర్ట్ డైరెక్టర్ స్పందిస్తూ , హవేలీలోని ప్రతి అడుగు ఒక ఎమోషన్ ను వ్యక్తీకరిస్తుంది. చూసేందుకు మాత్రమే హాంటెడ్ హౌస్ లా ఉండటం కాదు. హాంటెడ్ హౌస్ లో మనమంతా ఉన్న ఫీల్ కలిగిస్తుంది. ఈ హవేలీ చూస్తుంటే మీకు కథలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది` అని అన్నారు.
ఈ హవేలీ సెట్‌లోని వస్తువులు, బొమ్ములు అనాటిరోజులను గుర్తు చేసేలా చాలా సహజంగా ఉండటం విశేషం. టెలిఫోన్ నుంచి, రాజమహల్ యాజమాని సంజయ్ దత్ ఫోటోతోపాటు, అప్పుడు వాడిన వస్తువులు కూడా చాలా సహజంగా కనిపిస్తున్నాయి.
అందుకే ఇది ఈ మూవీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ అవతల, అజీజ్ నగర్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టూడియోలో ఓ సెట్, అల్యూమినియం ఫ్యాక్టరీలో మరో సెట్ ని వేశారు.
ఇక ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న `రాజా సాబ్` మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇందులో సంజయ్ దత్ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేస్తున్నారు.
తాజాగా విడుదలైన టీజర్ ని చూస్తుంటే, రాజమహల్ సంజయ్ దత్‌ని అని తెలుస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ ఆస్తులను తానే అనుభవించాలని చెప్పి అక్కడే ఆత్మ(దెయ్యం)గా ఉండిపోతాడు. ఆ కోటలోి వచ్చిన వారిని పట్టి తన రాజభోగాలు అనుభవిస్తుంటారు. అలా ప్రభాస్ తోపాటు ఆయన ఫ్రెండ్స్, ముగ్గురు హీరోయిన్లు ఆ రాజమహల్‌కి వెళ్తారు.
అక్కడ వారు ఎలాంటి అనుభవాలుఫేస్ చేశారు, సంజయ్ దత్, ప్రభాస్‌లోకి ఎలా వచ్చాడు, ఆ తర్వాత ఏం చేశాడనేది ఈ మూవీ అని తెలుస్తుంది. ఆద్యంతం రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్‌గా ఇది సాగుతుందని, కామెడీ హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రం ద్వారా వింటేజ్ ప్రభాస్‌ని మనం చూడొచ్చు అని దర్శకుడు మారుతి చెప్పిన విషయం తెలిసిందే.