Renu Desai: సినిమాలు చేయకుండానే రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన, ఎలానో తెలిస్తే మైండ్‌ బ్లాక్‌

Published : May 11, 2026, 02:03 PM IST

రేణు దేశాయ్‌.. పవన్‌ కళ్యాణ్‌ నుంచి విడిపోయాక ఒంటరిగానే ఉంటోంది. రెండో పెళ్లికి దూరంగా ఉన్న ఆమె సినిమాలు చేయకుండానే కోట్లు సంపాదిస్తుంది. మరి ఎలా సాధ్యం? అనేది చూస్తే షాక్‌ అవుతారు. 

PREV
14
సినిమాలు లేకపోయినా రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన

రేణు దేశాయ్‌.. పవన్‌ కళ్యాణ్‌ తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. నటనని వదిలేసింది. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఆ మధ్య `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రంలో నటించింది. కానీ పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతుంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నట్టు సమాచారం. బలమైన కథ, పాత్రలు ఉన్న సినిమాలు చేయడానికి సిద్ధమే అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. మరి ఇన్నాళ్లు సినిమాలు చేయకుండానే రేణు దేశాయ్‌ ఫ్యామిలీని ఎలా లీడ్‌ చేస్తుంది. ఆమె కోట్లు ఎలా సంపాదిస్తుంది? అనేది చూస్తే ఆమె పెళ్లికి ముందే రిచ్‌ అట. ఆ విషయాలను రేణు దేశాయ్‌ స్వయంగా వెల్లడించింది.

24
పవన్‌ కళ్యాణ్‌తో విడిపోయిన రేణు దేశాయ్‌

రేణు దేశాయ్‌.. మనకు `బద్రి` సినిమా నుంచే తెలుసు. ఈ సినిమాతో ఆమె హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా చేసింది. ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. నిజానికి రామానాయుడు స్టూడియోలో ఒక ఆఫీస్‌లో పవన్‌ కళ్యాణ్‌ కూర్చొని ఉన్నాడు, దర్శకుడు పూరీ.. రేణుదేశాయ్‌ని పవన్‌కి పరిచయం చేశాడు. ఆ సమయంలోనే పవన్‌ని చూసి ఫిదా అయ్యిందట రేణు దేశాయ్‌. అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆ తర్వాత సినిమా చేసి ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. వీరికి అకీరా నందన్‌, ఆధ్య జన్మించారు. 2012లోనే వీరిద్దరు విడిపోయారు. విడిపోవడానికి భరణం కింద రేణు దేశాయ్‌కి పవన్‌.. కోట్ల రూపాయలు ఇచ్చినట్టు వార్తలున్నాయి. నలభై కోట్లకుపైగానే ఇచ్చాడని అన్నారు. కానీ దీన్ని ఆమె ఖండించింది. తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది.

34
రేణు దేశాయ్‌ కోట్ల సంపాదన వచ్చేది ఇలానే

మరి భరణం తీసుకోకుండా, ఇన్నాళ్లు సినిమాలు చేయకుండా రేణు దేశాయ్‌ ఎలా ఫ్యామిలీని లీడ్‌ చేస్తుంది? కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తుందనేది చూస్తే, ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. రేణు దేశాయ్‌ స్వయంగా ఈ విషయాలను వెల్లడించింది. వారిది చాలా సంపన్న కుటుంబం అట. అప్పట్లో చాలా ఆస్తులుండేవట. తమ తాతల సమయంలో ఏడెనిమిది ప్యాలెస్‌లాంటి బిల్డింగ్స్ ఉండేవట. ఆ తర్వాత అన్నీ పోయాయని తెలిపింది. పెళ్లి కాకముందు నుంచే తమ ఫ్యామిలీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారట. చిన్నప్పట్నుంచే రేణు దేశాయ్‌కి అందులో మంచి పట్టు ఉందట. తాను మంచి బిజినెస్‌ ఉమెన్‌ అని చెబుతుంది. బయట ఇన్నోసెంట్‌నే అయినా, వ్యాపారంలో మాత్రం తాను చాలా టాలెంటెడ్‌ అని చెప్పింది. ఇప్పటికీ ఆ వ్యాపారం చేస్తుందట రేణు దేశాయ్‌. తనకు ఇప్పుడు మేజర్‌గా ఇన్‌ కమ్‌ సోర్స్ అదే అని చెప్పింది.

44
రేణు టాలెంట్‌కి ఫిదా అవ్వాల్సిందే

ఆ తర్వాత స్టార్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిందట. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తానని, అందులోనూ తనకు మంచి కమాండ్‌ ఉందని తెలిపింది. వీటితోపాటు కొన్ని చిన్నా చితకా ఇతర వ్యాపారాలు కూడా ఉన్నట్టు తెలిపింది. ఇలా తనకు ఆదాయం వస్తుందని, ఆ విషయంలో సమస్య లేదని తెలిపింది. తమ తాతలనాటి ఆస్తులు మిగిలి ఉంటే ఇప్పుడు తమ రేంజ్‌ వేరే ఉండేదని తెలిపింది. మొత్తంగా సినిమాలు చేయకపోయినా రియల్‌ ఎస్టేట్‌, స్టాక్‌ మార్కెట్‌ ద్వారా కోట్లు సంపాదిస్తుంది రేణు దేశాయ్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories