రవితేజ మళ్లీ రిస్క్ చేస్తున్నాడా? ఫెయిల్యూర్‌ డైరెక్టర్‌కి లైఫ్‌ ఇచ్చేందుకు నిర్ణయం?

Published : Feb 10, 2025, 08:56 AM IST

మాస్‌ మహారాజా రవితేజ మరోసారి రిస్క్ చేయబోతున్నాడు. ఆయనే ఫ్లాప్‌లో ఉన్నారంటే మరో ఫ్లాప్‌లో ఉన్న దర్శకుడికి లైఫ్‌ ఇవ్వబోతున్నారు. మరి ఆ కథేంటో చూస్తే?  

PREV
14
రవితేజ మళ్లీ రిస్క్ చేస్తున్నాడా? ఫెయిల్యూర్‌ డైరెక్టర్‌కి లైఫ్‌ ఇచ్చేందుకు నిర్ణయం?

మాస్‌ మహారాజా రవితేజ జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో రవితేజ భారీ అంచనాలతో, వచ్చిన మూవీస్‌ బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేస్తున్నాయి.

`రావణాసుర` నుంచి ఇది స్టార్ట్ అయ్యింది. `టైగర్‌ నాగేశ్వరరావు` మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ వర్కౌట్‌ కాలేదు. అలాగే `ఈగల్‌` మూవీ విషయంలో కూడా ఇదే జరిగింది. గతేడాది `మిస్టర్‌ బచ్చన్‌` కూడా అలానే డిజప్పాయింట్‌ చేసింది. 
 

24
raviteja

అయితే ఈ సినిమాల విషయంలో రవితేజ నేల విడిచి సాము చేశారు. తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ వదిలేసి సినిమాలు చేశారు. యాక్షన్‌ మూవీస్‌, సీరియస్‌గా సాగే సినిమాలు చేసి బోల్తా కొట్టారు. ఈ క్రమంలో రియలైజ్‌ అయిన రవితేజ ఇప్పుడు సరైన ట్రాక్‌ లో పడుతున్నారు.

తాజాగా ఆయన `మాస్‌ జాతర` అనే సినిమాలో నటిస్తున్నారు. దీనికి భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్నారు. ఇది రవితేజ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌, మాస్‌ అంశాల సమాహారంగా రూపొందుతుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌ కావడం విశేషం. `ధమాఖా` మ్యాజిక్‌ రిపీట్‌ చేయాలని చూస్తున్నారు. 
 

34
raviteja

ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ మరో రిస్క్ చేస్తున్నారు. ఆయన పరాజయంలో ఉన్న దర్శకుడితో సినిమా చేస్తున్నారు. అసలే రవితేజ ఫ్లాపుల్లో ఉన్నారు. ఇప్పుడు మరో ఫ్లాప్‌ డైరెక్టర్‌కి లైఫ్‌ ఇవ్వబోతున్నాడట. ఆయన ఎవరో కాదు కిశోర్‌ తిరుమల.

`నేను శైలజ` చిత్రంతో తానేంటో నిరూపించుకున్నారు కిశోర్‌ తిరుమల. ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీని అందించారు. సెన్సిబిలిటీస్‌, హ్యూమన్‌ ఎమోషన్స్ కి ఎలాంటి ప్రయారిటీ ఇస్తారో చూపించారు. టెక్నీషియన్‌గా మంచి టాలెంటెడ్‌. కానీ ఆయన ఇటీవల రూపొందించిన చిత్రాలు మాత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయాయి. 
 

44
Raviteja

కిశోర్‌ తిరుమల రూపొందించిన `వున్నది ఒక్కటే జిందగీ`, `చిత్రలహరి`, `రెడ్‌`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` వంటి సినిమాలు రూపొందించారు. ఈ చిత్రాలను ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ కలేకపోయాయి. దీంతో సుమారు మూడేళ్ల గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. రవితేజతో సినిమా చేయనున్నారట.

మాస్‌ మహారాజాకి కథ చెప్పగా, ఆయన ఇంప్రెస్‌ అయ్యారని, ఈ మూవీ ఓకే అయ్యిందని తెలుస్తుంది. `మాస్‌ జాతర` సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత ఈ మూవీ పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది. యూత్‌ని టార్గెట్‌ చేస్తూ ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ని తీసుకురాబోతున్నారని సమాచారం. ఇక `మాస్‌ జాతర` మూవీ ఈ సమ్మర్‌లో విడుదల కాబోతుంది. 

read more: ప్రభాస్‌, మహేష్‌, పవన్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, చరణ్‌ మూవీస్‌ లైనప్‌.. 3,4 ఏళ్లు పాన్‌ ఇండియా సినిమాల జాతరే

also read: అల్లు అర్జున్‌ `పుష్ప 2` సక్సెస్‌పై చిరంజీవి ఊహించని కామెంట్‌.. మెగా, నందమూరి ఫ్యాన్స్ వార్‌పై సెటైర్లు

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories