Pushpa 2: పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించినప్పటికీ, కేరళలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. కేరళ డిస్ట్రిబ్యూటర్ ఆ విషయం ప్రస్తావిస్తూ కారణం చెప్పారు. అయితే, అల్లు అర్జున్ కి కేరళలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా ఈ ఫలితం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
What Went Wrong with Pushpa 2 in Kerala? in telugu
పుష్ప 2 భాక్సాఫీస్ దగ్గర నమ్మలేని విధంగా దూసుకుపోయింది. ముఖ్యంగా నార్త్ లో వస్తున్న కలెక్షన్స్ అభిమానులను, ట్రేడ్ విశ్లేషకులను, సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. అల్లు అర్జున్-నటించిన ఈ చిత్రం యొక్క హిందీ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా హిస్టారికల్ నెంబర్స్ ను నమోదు చేసింది ఉంది.
అయితే పుష్ప 2 మూవీ కన్నడ, తమిళ, మలయాళీ భాషల్లో నష్టాల్ని మిగిల్చిందని ట్రేడ్ అంటోంది. ఏపీలోని కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదని చెప్తున్నారు. ఏదైతేనేం మొత్తంగా ఈ మూవీ అయితే రెండు వేల కోట్ల మార్క్ దాటేసింది. అయితే అల్లు అర్జున్ కు కేరళలో ఫ్యాన్స్ ఎక్కువ. అయినా అక్కడ డిజాస్టర్ ఎందుకు అయ్యిందని తేలలేదు. పుష్ప 2 సినిమా థాంక్స్ మీట్ కేరళ డిస్ట్రిబ్యూటర్ ముకేష్ ఆర్ మెహతా కూడా మాట్లాడి క్లారిటీ ఇచ్చేసారు.
23
What Went Wrong with Pushpa 2 in Kerala? in telugu
థాంక్స్ మీట్‌లో కేరళ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ.. మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, అక్కడి స్టార్ హీరోలకు కూడా రాని స్దాయిలో ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే పుష్ప2 టిపికల్ మళయాళి స్టైల్ మూవీ కాదని, అందుకే కాస్త లేటుగా కనెక్ట్ అవుతున్నారని చెప్పారు. ఇప్పుడు ఈ మూవీని ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫాంలో ఎక్కువ మంది చూస్తున్నారని తెలిపాడు. త్వరలోనే ఈ మూవీని అక్కడ మళ్లీ త్రీడీ వర్షెన్‌లో రిలీజ్ చేస్తామని తెలిపాడు.
33
What Went Wrong with Pushpa 2 in Kerala? in telugu
అయితే ఆయన చెప్పిన మాటల్లో కొంత క్లారిటీ వచ్చినా , పూర్తిగా అయితే లేదు. కేరళలో అల్లు అర్జున్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఏమైంది. వాళ్లు గతంలో అల్లు అర్జున్ మాస్ మసాలా సినిమాలు చూసి ఎంజాయ్ చేసారు కదా.
అలాంటిది ఈ పుష్ప 2 అక్కడి జనాలకు ఎందుకు ఎక్కలేదు? అనేది ప్రశ్నార్దంకంగా ఇంకా మిగిలిపోయింది. మరో ప్రక్క ఈ త్రీడీ వర్షెన్ రిలీజ్ మీద మైత్రీ మూవీస్ అయితే ఇప్పటిదాకా అఫీషియల్ గా ఏమీ చెప్పలేదు.