Vishwak Sen: కారు కాల్చేసినప్పుడు, చిరంజీవి గారు ఫోన్ చేసారు,మర్చిపోలేను

Published : Feb 10, 2025, 08:38 AM IST

Vishwak Sen: అప్పుడు డాడీ ఫోన్ మోగుతుంటే నేను ఎత్తాను. హలో ఎవరు మాట్లాడేది అంటే నేనూ చిరంజీవి అన్నారు. నాకు వెంటనే షేక్ అయి డాడీకి వెళ్లి ఫోన్ ఇచ్చాను..మీకు తెలీదు ఆ రోజు మా కారు కాలిపోయి మంచి పని అయింది అనుకున్నాం సార్ మేము. 

PREV
13
 Vishwak Sen: కారు కాల్చేసినప్పుడు, చిరంజీవి గారు ఫోన్ చేసారు,మర్చిపోలేను
Vishwak Sen Shared his memory with Chiranjeevi at Laila Pre Release Event


మెగాస్టార్ చిరంజీవి తాజాగా విశ్వక్సేన్ లైలా చిత్రం ప్రీ రిలీజ్  ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. ఈ విషయమై చాలా ఎగ్జైట్ అయ్యారు విశ్వక్. ఈ క్రమంలో చిరంజీవితో తన అనుబంధం గురించి విశ్వక్ చెప్పుకొచ్చారు.

విశ్వక్సేన్ మాటల్లో చిరంజీవితో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధం  విషయాలు బయిటకు వచ్చి అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా కారు కాలిపోయినప్పుడు చిరంజీవి ఫోన్ చేయటం, తను చిరంజీవి సినిమా చూసి నటుడు అవ్వాలనుకోవటం వంటి విషయాలు విశ్వక్సేన్ చెప్పారు. అవేంటో చూద్దాం. 

23
Vishwak Sen Shared his memory with Chiranjeevi at Laila Pre Release Event


విశ్వక్సేన్ మాట్లాడుతూ.."మా నాన్న చిరంజీవి గారికి వీరాభిమాని. పాలిటిక్స్ టైమ్‌లో మీ ఫాలోవర్‌గా ఉన్నప్పుడు ఓ గొడవలో మా కారు నైట్ కాల్చేశారు.. కారు కాలిపోతుంది.. న్యూస్ అది అవుతుంది.. ఇంట్లో అందరూ భయపడుతున్నాం. డాడీ బయట మీడియాతో మాట్లాడుతున్నారు.

అప్పుడు డాడీ ఫోన్ మోగుతుంటే నేను ఎత్తాను. హలో ఎవరు మాట్లాడేది అంటే నేనూ చిరంజీవి అన్నారు. నాకు వెంటనే షేక్ అయి డాడీకి వెళ్లి ఫోన్ ఇచ్చాను..మీకు తెలీదు ఆ రోజు మా కారు కాలిపోయి మంచి పని అయింది అనుకున్నాం సార్ మేము. ఎందుకంటే చిరంజీవి గారి నుంచి మాకు కాల్ వచ్చింది అనే ఆనందమే అప్పుడు ఎక్కువ ఉంది.

33
Vishwak Sen Shared his memory with Chiranjeevi at Laila Pre Release Event


అలాగే నా ఫేవరెట్ సినిమా 'ఆపద్భాంధవుడు'.. నేను యాక్టర్ అవుదామని డిసైడ్ అవ్వడానికి ఆ సినిమా కూడా ఒక కారణం సార్.. థాంక్యూ సార్ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. లవ్యూ సార్. ఇక ఈ సినిమా విషయానికొస్తే ఈ డైరెక్టర్ చాలా మంది హీరోలకి ఈ స్టోరీ చెబితే చేయను అన్నారట.

విశ్వక్‌కి పోయి చెప్పంటే.. విశ్వక్ బొంగు కూడా చేయడు.. నేను పోయి టైమ్ వేస్ట్ అన్నాడట. కానీ అతన్ని నా దగ్గరికి తీసుకొచ్చింది నా నిర్మాత సోహో అన్న. థాంక్స్ అన్నా.. ఈ కథ నా దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు విశ్వక్సేన్. 
 

Read more Photos on
click me!

Recommended Stories