Rashmika Mandanna: కొత్త పెళ్లి కూతురు రష్మికకి సీఎం రేవంత్ రెడ్డి సతీమణి సర్ప్రైజ్.. వైరల్ ఫోటోస్ ఇవిగో

Published : Mar 01, 2026, 07:43 PM ISTUpdated : Mar 01, 2026, 07:44 PM IST

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మార్చి 4న జరిగే వెడ్డింగ్ రిసెప్షన్ కోసం అతిథుల్ని ఆహ్వానిస్తున్నారు. తాజాగా రష్మిక సీఎం రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేశారు. 

PREV
15
రష్మిక మందన్న, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవల ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లో జరిగిన వివాహ వేడుకతో ఒక్కటయ్యారు. కొంతకాలంగా రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఉదయ్ పూర్ లో జరిగిన వీరి పెళ్ళికి కుటుంబ సభ్యులు కాకుండా కొద్దిమంది సినీ ప్రముఖుల్ని మాత్రమే అతిథులుగా ఆహ్వానించారు. కానీ మార్చి 4న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుక జరగనుంది.

25
సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి రష్మిక

రిసెప్షన్ వేడుకకి విజయ్, రష్మిక సినీ రాజకీయ ప్రముఖులు, ఇతర సెలెబ్రిటీలని ఆహ్వానిస్తున్నారు. అతిథుల్ని ఆహ్వానించే క్రమంలో తాజాగా రష్మిక మందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, గీత దంపతులని రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ కి ఇన్వైట్ చేసింది.

35
రేవంత్ రెడ్డి సతీమణి సర్ప్రైజ్

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా కొత్త పెళ్లి కూతురు రష్మికని రేవంత్ రెడ్డి సతీమణి గీత సర్ప్రైజ్ చేశారు. రష్మికకు పసుపు కుంకుమ ఇచ్చిన గీత..చీరని కానుకగా ఇచ్చారు.

45
అభిమానుల కోసం

సాంప్రదాయబద్ధంగా రష్మికని గీతా రెడ్డి గౌరవించారు. రష్మిక, విజయ్ వెడ్డింగ్ రిసెప్షన్ తాజ్ కృష్ణ హోటల్ లో జరగనుంది. ఈ క్రమంలో రష్మిక, విజయ్ అభిమానుల కోసం ఒక ప్రకటన విడుదల చేశారు.

55
రిసెప్షన్ వేడుక ఎక్కడంటే..

మార్చి 4న జరిగే వెడ్డింగ్ రిసెప్షన్ కి ఆహ్వానం ఉన్న వారు మాత్రమే రావాలి అని.. ఆహ్వానం లేకుండా వచ్చి ఇబ్బంది పడొద్దని రష్మిక, విజయ్ పేర్కొన్నారు. అభిమానుల క్షేమమే తమకు ముఖ్యం అని.. అభిమానులు ఎక్కడా ఉన్నా వారి ఆశీస్సులు తమకు ఉంటాయి అని పేర్కొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories