VIROSH Wedding: రష్మిక మందన్నా, విజయ్ పెళ్లిలో ఎన్ని కేజీల నగలు ధరించారో తెలుసా? ఎన్ని కోట్లు అంటే?

Published : Mar 01, 2026, 07:18 PM IST

VIROSH Wedding: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఇటీవలే మ్యారేజ్‌ చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిలో ఈ ఇద్దరు ధరించిన నగలు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. మరి వాటి ధరెంతంటే?

PREV
15
టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా విజయ్‌ దేవరకొండ, రష్మిక పెళ్లి

రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ పెళ్లి టాలీవుడ్‌లోనే కాదు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతటి ఘనంగా ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ మ్యారేజ్‌ చేసుకోలేదు. దీంతో వీరి పెళ్లి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ కల్చర్‌, ఆ విధానం గురించి అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. దీంతో ఇది టాప్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. అదే సమయంలో ఎక్కువగా మాట్లాడుకునే పెళ్లి కూడా ఇదే. 

25
రష్మిక, విజయ్‌ ధరించిన గోల్డ్ ధర

 తమ పెళ్లిలో టెంపుల్‌ స్టయిల్‌ గోల్డ్ జ్యూవెల్లరీని ధరించారు  రష్మిక, విజయ్‌.   ఈ టెంపుల్-స్టైల్ గోల్డ్ జ్యువెలరీని ప్రత్యేకంగా చేయించారు. దీని ఖరీదు రూ.4 నుంచి 7 కోట్ల మధ్య ఉంటుందట. అవును, మీరు చదివింది నిజమే. ఈ నగలు 2 నుంచి 3 కిలోల బరువు ఉన్నాయని, వీటి తయారీకి పది నెలలకు పైగా పట్టిందని చెబుతున్నారు. ప్రతి డిజైన్‌ను ఎంతో శ్రద్ధగా రూపొందించారు.

35
రష్మిక మందన్నా ధరించిన నగలు

ఈ నగలను హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ స్వర్ణకారుడు డిజైన్ చేశాడట. ఆయన సంప్రదాయ సౌత్ ఇండియన్ టెంపుల్ స్టైల్స్‌కు పెట్టింది పేరు. రష్మిక పెళ్లి దుస్తుల్లో భాగంగా పొడవైన బంగారు హారాలు, అందంగా డిజైన్ చేసిన ఒడ్డాణం, భారీ గాజులు, పెద్ద జుంకాలు, పెద్ద పాపిడి బిళ్ల ధరించింది.

45
అందరి దృష్టిని ఆకర్షించిన రష్మిక నగలు

రష్మిక ధరించిన ప్రతి ఆభరణంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ స్ఫూర్తి కనిపిస్తుంది. ఈ నగలన్నీ ఆమెకు ఆధునిక మహారాణి రూపాన్ని ఇచ్చాయి. దీంతో ఆమె యువరాణిలా మెరిసిపోయింది. అందరి దృష్టిని ఆకర్షించింది. 

55
విజయ్‌ దేవరకొండ నగలు

విజయ్ కూడా ఆమెకు ఏమాత్రం తీసిపోని విధంగా రాజసం ఉట్టిపడే బంగారు ఆభరణాలు ధరించాడు. అతను మెడలో కాసుల మాల, చెవులకు సంప్రదాయ కడుక్కన్, రాయల్ వెడ్డింగ్ డ్రెస్‌కు నప్పేలా అదిరిపోయే గోల్డ్ చైన్స్ వేసుకున్నాడు. ఈ మ్యాచింగ్ నగలు వీరి పెళ్లి  వేడుకకు మరింత శోభను తెచ్చాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories