రష్మిక కెరీర్‌లో కమర్షియల్ విజయాలు, గుర్తుండిపోయే పాత్రలు రెండూ ఉన్నాయి. 'పుష్ప: ది రైజ్'లో ఆమె పోషించిన శ్రీవల్లి పాత్ర ఒక కల్చరల్ ఫినామినన్‌గా మారింది. ఆ సినిమాలోని పాటలు, సీన్లు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. రష్మిక నటన ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది.
ఇక 'యానిమల్' సినిమాలో క్లిష్టమైన పాత్రలో భావోద్వేగాలను పండించి తన నటనలోని వైవిధ్యాన్ని నిరూపించుకుంది. అంతే కాదు అందుకు ముందు తెలుగులో 'గీత గోవిందం' ఆమెను ఇంటింటికీ పరిచయం చేసిన ప్రేమకథా చిత్రంగా నిలిచిపోయింది.
ఈమధ్య కాలంలో వచ్చిన 'ఛావా', 'తమ' వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో బాక్సాఫీస్‌పై తన పట్టును కొనసాగించి.. రష్మికను బాలీవుడ్ ఆడియన్స్ కు మరింత దగ్గర చేసింది. .