VV Vinayak: ఆది బడ్జెట్ 2 కోట్లే.. కానీ మార్నింగ్ షో పడగానే కోట్ల ఆఫర్..!

Published : Apr 05, 2026, 12:49 PM IST

VV Vinayak: మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ఎక్కడికి వెళ్లారు? ఏడేళ్లుగా ఎందుకు గ్యాప్ ఇచ్చారు? ఎన్టీఆర్ తో 'ఆది' షూటింగ్ సమయంలో జరిగిన సీక్రెట్స్, తన రాజకీయ ఆకాంక్షలపై వినాయక్ చేసిన సంచలన వ్యాఖ్యలు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఏం అన్నారంటే.? 

PREV
15
ఏడేళ్ల గ్యాప్‌కు కారణం అదే!

తెలుగు తెరపై మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వి.వి. వినాయక్. 'ఆది' సినిమాతో దర్శకుడిగా పరిచయమై, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఆయన, ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని ఎత్తుపల్లాలను పంచుకున్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆయన మళ్లీ వెండితెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. హీరోగా 'శీనయ్య' సినిమా కోసం వెళ్లినప్పుడు లైపోసెక్షన్ వికటించి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, అందుకే ఏడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని వినాయక్ బాధగా చెప్పారు.

25
ఎన్టీఆర్ అడిగారు.. నేను రాశాను!

స్విట్జర్లాండ్‌లో ఎన్టీఆర్‌ను కలిసినప్పుడు ఆయన ఒక మాస్ కథ కావాలని అడగడంతో, కేవలం రెండు రోజుల్లోనే 'ఆది' కథను సిద్ధం చేశానని వినాయక్ గుర్తు చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వినాయక్, రాయలసీమ నేపథ్యంలో సినిమా తీయడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. 'కోబలి' వంటి పదాలను రీసెర్చ్ చేసి వాడటంతో అక్కడి ప్రజలకు సినిమా బాగా కనెక్ట్ అయింది.

35
రాజకీయాల్లోకి వస్తానా?

తన తండ్రి సర్పంచ్‌గా చేశారని, తన తమ్ముడు ప్రస్తుతం వైసీపీ (YCP) పార్టీలో ఉన్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తమ ఇంటికి కూడా వచ్చారని చెబుతూ.. "రాజకీయాల్లోకి రానని చెప్పను, అలాగని ఇంట్రెస్టెడ్ అని కూడా ఇప్పుడే చెప్పలేను.. అది డెస్టినీ మీద ఆధారపడి ఉంటుంది" అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

45
కే.విశ్వనాథ్ ప్రశంస!

'అదుర్స్' సినిమాను చూసి లెజెండరీ డైరెక్టర్ కే.విశ్వనాథ్ స్వయంగా ప్రశంసించడం తన జీవితంలో పొందిన అతిపెద్ద అవార్డు అని వినాయక్ గర్వంగా చెప్పుకొచ్చారు. 'అదుర్స్' సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఉన్నప్పటికీ, బ్రహ్మానందం టైమింగ్, ఆ కంటెంట్‌ను మళ్లీ మ్యాచ్ చేయడం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు

55
పూరి జగన్నాధ్ లా ఉండాలనుంది!

సక్సెస్, ఫెయిల్యూర్ ను చాలా ఈజీగా తీసుకునే పూరి జగన్నాధ్ ధైర్యం అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనలా లైఫ్ ను లైట్ గా తీసుకోవాలని ఉందని వినాయక్ అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories