అనసూయకి బంపర్‌ ఆఫర్‌.. `జబర్దస్త్` కి గుడ్‌బై చెప్పబోతున్న రష్మీ గౌతమ్‌?

First Published Apr 10, 2021, 11:08 AM IST

సెక్సీ యాంకర్‌ రష్మీ గౌతమ్‌ `జబర్దస్త్` కి గుడ్‌బై చెప్పబోతుందా? హాట్‌ యాంకర్‌ అనసూయ బంపర్‌ ఆఫర్‌ కొట్టబోతుందా? అంటే అవుననే టాక్‌ టెలివిజన్‌ నుంచి, సోషల్‌ మీడియా నుంచి వినిపిస్తుంది. మొత్తానికి రష్మీ `జబర్దస్త్`ని వీడబోతుందనే న్యూస్‌ వైరల్‌గా మారింది. 

`జబర్దస్త్`, `ఎక్స్ ట్రా జబర్దస్త్` అంటే అనసూయ, రష్మీలే గుర్తుకొస్తారు. అంతగా వీరిద్దరు తమ హాట్‌ అందాలతో, చలాకీ యాంకరింగ్‌తో ఈ షోకి క్రేజ్‌ తీసుకొచ్చారు. ఈ షోతో వీరిద్దరు క్రేజ్‌ సంపాదించారు.
undefined
గురువారం, శుక్రవారం వచ్చిందంటే రెండు కామెడీ షోలతో అలరిస్తుంటారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ నవ్వులు పంచుతుంటారు. ఈ రెండు షోలు, రష్మీ, అనసూయలను వేరు చేసి చూడలేము. జబర్దస్త్ షోలకు వీరిద్దరు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయారు. ఏడేళ్లుగా ఈ షో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవడంలో వీరిద్దరు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
undefined
ఇదిలా ఉంటే తాజాగా ఓ షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. యాంకర్‌ రష్మీ `ఎక్స్ ట్రా జబర్దస్త్`కి గుడ్‌బై చెప్పబోతుందట. త్వరలోనే ఈ హాట్‌ అందాల భామ ఈ కామెడీ షోని వదిలేయబోతుందనే వార్తలు ఇప్పుడు ప్రచారంలో ఉంది.
undefined
స్టార్‌ మా, జీ తెలుగులో రెండు షోలకు రష్మీ గౌతమ్‌ కమిట్‌ అయ్యిందట. రష్మీకి టెలివిజన్‌ ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ అమ్మడికి ఈ రెండు టెలివిజన్‌ ఛానెల్స్ భారీగానే ఆఫర్‌ చేశారట. దీంతో రష్మీ ఆయా షోస్‌ చేసేందుకు సిద్ధమయ్యిందట.
undefined
రష్మీ `జబర్దస్త్`లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ షోను వదలలేదు. మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా వెళ్లలేదు. ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ కు వచ్చిన ఐదేళ్ళలో కేవలం మూడు సార్లు మాత్రమే ఈమెకు పారితోషికం పెంచారని, బయట మంచి అవకాశాలు వస్తుండడంతో అక్కడికి వెళ్లిపోవాలి అని రష్మీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
undefined
అయితే ఇదే విషయం మల్లెమాల దగ్గర చర్చించి పారితోషికం పెంచితే ఇక్కడే ఉండటం, లేదంటే వెళ్లిపోవాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నట్టు టాక్‌.
undefined
ఇదిలా ఉంటే రష్మీ షోకి గుడ్‌బై చెప్పడం మరో సెక్సీ యాంకర్‌ అనసూయకి వరంగా మారబోతుంది. ఆమెకిది ఓ రకంగా బంపర్‌ ఆఫర్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఓ వైపు `జబర్దస్త్`కి యాంకర్‌గా ఉన్న అనసూయకి `ఎక్స్ ట్రా జబర్దస్త్` కి యాంకర్‌గా చేసే అవకాశం రావచ్చు.
undefined
ఎందుకంటే గతంలో దీనికి ఆమె యాంకర్‌గానూ చేశారు. దీంతో ఈ ఛాన్స్ అనసూయకే వస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే అనసూయ రెండు జబర్దస్త్ షోలో ఓ ఊపు ఊపేయబోతుందని, ఆమె క్రేజీ ఇంకా మరింతగా పెరుగుతుందని చెప్పొచ్చు.
undefined
ఇప్పటికే అనసూయ యాంకర్‌గా, ఐటెమ్స్ సాంగ్స్ చేస్తూ, నటిగా పలు క్రేజీ, భారీ ప్రాజెక్ట్ లను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఈ షో కూడా తనకే వస్తే, అటు టీవీ, ఇటు సినిమాలతో మరింతగా అలరించబోతుందని చెప్పొచ్చు. అనసూయ అభిమానులకు వారానికి రెండు సార్లు చూసే అదృష్టం వరిస్తుంది.
undefined
ఇదిలా ఉంటే రష్మీ బయటకు వెళితే ఎంత వరకు సక్సెస్‌ అవుతుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే జబర్దస్త్ ని వీడిన నాగబాబు జీతెలుగులో `అదిరింది` షో చేశారు. అది సక్సెస్‌ కాలేదు. ఇప్పుడు ఆయనకు ఒక్క షో కూడా లేదు. అలాగే `జబర్దస్త్‌` ని వీడిన కంటెస్టెంట్లు, కామెడీయన్లు కూడా సక్సెస్‌ కాలేదు. మరి రష్మీ ఏ మేరకు సక్సెస్‌ అవుతుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఒకవేళ రష్మీ ఇతర ఛానెల్స్ లో చేసే షోస్‌ సక్సెస్‌ కాలేకపోతే, ఆమె భవిష్యత్‌ ఏంటీ? అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.
undefined
`జబర్దస్త్`లో సుడిగాలి సుధీర్‌, రష్మీల మధ్య ఘాటు లవ్‌ స్టోరీ సాగుతుంది. వీరిద్దరి రొమాన్స్ షోకే క్రేజ్‌ వచ్చేది. మరి రష్మీ ఈ షోని వీడితే వీరి రిలేషన్‌కి బ్రేకప్‌ పడుతుందా? సుధీర్‌ `జబర్దస్త్‌`లోనే ఉంటాడా? ఆమెతోనే వెళ్లిపోతాడా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.
undefined
click me!