
యాంకర్ రష్మి గౌతమ్ పెట్ లవర్ అనే విషయం తెలిసిందే. ఆమె జంతువుల విషయంలో ఎంతో ప్రేమగా ఉంటారు. వాటి రక్షణ కోసం పోరాడుతున్నారు. ఇటీవల సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పు విషయంలో అభ్యంతరం తెలియజేస్తున్నారు. కుక్కలను ప్రత్యేక షెల్టర్లకి తరలించాలనే నిర్ణయంపై అభ్యంతరం చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్‌ని నిర్వహించారు. ఇందులో రేణు దేశాయ్ ఫైర్ అయ్యింది. ఈ సందర్భంగా రష్మి గౌతమ్ కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా రష్మి గౌతమ్ పెట్ డాగ్స్ విషయంలో మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 15, ఇరవై ఏళ్లు ఎమోషనల్ బాండింగ్ అవసరం ఉందని చెప్పారు. ఆమె మాట్లాడుతూ, కుక్కల విషయంలో రూల్స్ ఉన్నాయని, కానీ వాటిని పాటించడం లేదని తెలిపింది. వాటికి సరైన బర్త్ కంట్రోల్ లేదు. సరైన వ్యాక్సినేషన్ లేదని చెప్పింది. `అసలు మూగ జీవాలు మన నుంచి ఏం ఆశిస్తున్నాయి, వెండినా, గోల్డ్ నా, ప్రాపర్టీనా, డబ్బులా? మన నుంచి అవి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నాయి. కనీసం ఫుడ్ కూడా ఆశించడం లేదు. మనం పడేసే ఫుడ్ తింటున్నాయి. అవి కూడా చెత్త కుప్పలో ఏరుకొని తింటాయి. షాప్ క్లీన్ చేసే నీళ్లు తాగుతున్నాయి. షెల్టర్ కూడా లేదు. చెట్ల కింద పడుకుందామంటే చెట్లని కూడా నరికేస్తున్నారు. ఎండకి మూలుగుతూ రోడ్డు పక్కని ఏదో ఒక మూలకు పడి ఉంటాయి. అవి మన నుంచి ఏం ఆశిస్తున్నాయని, వాటిని పట్టుకొని ఎక్కడో పడేయడానికి. అయితే వాటిని తీసుకెళ్లండి, కానీ మంచి షెల్టర్‌లో వేయండి. సుప్రీంకోర్ట్ ఇచ్చిన తీర్పుని మేం కూడా గౌరవిస్తాము. పాటిస్తాము. కానీ వాటికి వరల్డ్ క్లాస్ షెల్టర్లు ఉండాలి` అని తెలిపింది రష్మి.
ఆమె ఇంకా మాట్లాడుతూ, కుక్కలు అన్ని ఉన్నాయంటే అదొక యుద్ధభూమి. అవి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోవు, ఫైట్ చేసుకుంటాయి. ఈ క్రమంలో కొన్ని చనిపోతాయి. డాగ్స్ ని సరిగ్గా సెపరేట్ చేయాలి. వాటిని సరిగా చూసుకోవాలి, మెడికల్ కేర్ ఇవ్వాలి. అవన్నీ జరిగితే మేం కూడా సుప్రీంకోర్ట్ ని సపోర్ట్ చేస్తాము` అని చెప్పింది రష్మి. ఈ సందర్భంగా ఆమె మరో ఆసక్తికర కామెంట్ చేసింది. కొందరు డాన్స్ ని క్యూట్‌గా ఉన్నాయని ఇంట్లోకి తెచ్చుకుని పెంచుకుంటారు. ఆ తర్వాత రోడ్డుపైన వదిలేస్తున్నారు. వాటి విషయంలో రష్మి గౌతమ్ స్పందిస్తూ, మీరు 10-15ఏళ్లు ఎమోషనల్, ఫైనాన్షియల్ కమిట్‌మెంట్ ఇస్తేనే వాటిని పెంచుకోవాలని తెలిపింది.
ఫారెన్ బ్రీడ్ కావాలంటే లైసెన్స్ ఉన్న వారి నుంచే తీసుకోవాలి. మన ఇండియాలో లక్షల పెట్ షాప్స్ ఉన్నాయి. కానీ వాటిలో 20 మాత్రమే రిజిస్టర్ లైసెన్స్ ఉన్న పెట్ షాప్స్ ఉన్నాయి. ఫారెన్ బ్రీడ్ కావాలంటే వారి లైసెన్స్ ని చెక్ చేయండి. దాని(డాగ్) హిస్టరీని చెక్ చేయండి. ఆ కుక్క ఎక్కడి నుంచి వచ్చిందో చెక్ చేయాలి. దాని మదర్ ఎలా ఉందనేది కూడా మీరు తెలుసుకోవాలి, దాని రెస్పాన్సిబులిటీ కూడా మీరే తీసుకోవాలి. అంతిమంగా 15-20ఏళ్లు ఎమోషనల్, ఫైనాన్షియల్ కమిట్‌మెంట్ ఇవ్వగలిగితేనే కుక్కలను ఇంట్లోకి తెచ్చుకోండి` అని తెలిపింది.
ఇక రోడ్డుపై చిన్న పిల్లలను కుక్కలు కరవడానికి సంబంధించి రష్మి మాట్లాడుతూ, పేద, కార్మికుల పిల్లల్ని కుక్కలు కరుస్తున్నాయని అంటున్నారు. ఆ పిల్లలకు ఎందుకు రోడ్డుపై వదిలేస్తుంది. వారికోసం ప్రభుత్వం డే కేర్ సెంటర్లని ఏర్పాటు చేయోచ్చు కదా, వారి రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి కదా. అది వదిలేసి పిల్లల్ని కుక్కలు కరుస్తున్నాయని చెప్పడం సరికాదు అని చెప్పింది రష్మి. ఈ విషయంలో తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది తెలిపింది.