థియేటర్లలో ధూరందర్, ది రాజా సాబ్, మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలతో సందడి పెరిగింది. వేరే సినిమాలు రిలీజ్ కు ఉన్నా.. ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేదు. ఈ మూడు సినిమాల బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటో తెలుసా?
రణ్‌వీర్ సింగ్ సినిమా ధూరందర్ విడుదలై 47 రోజులైంది. దీని హవా ఇంకా కొనసాగుతోంది, కానీ వసూళ్లు బాగా తగ్గాయి. ప్రభాస్ సినిమా ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోతోంది. ఈ టైంలో వచ్చిన 70 ఏళ్ల హీరో చిరంజీవి సినిమా మన శంకర వర ప్రసాద్ గారు మిగతా రెండు సినిమాలపై ఆధిపత్యం చూపిస్తూ భారీగా వసూలు చేస్తోంది. మూడు సినిమాల కలెక్షన్లు చూద్దాం...
26
దూసుకుపోతోన్న ధురంధర్..
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ సినిమా డిసెంబర్ 5, 2025న విడుదలైంది. మొదటి రోజు నుంచే బాక్సాఫీస్‌పై పట్టు సాధించింది. సినిమా వరుసగా భారీ వసూళ్లు రాబట్టింది. సినిమా విడుదలై 47 రోజులైంది. అయినా ఇప్పటి వరకూ ఈసినిమా ప్రభావం తగ్గడంలేదు.
36
ప్రపంచ వ్యాప్తంగా ధురంధర్ వసూళ్లు..
డైరెక్టర్ ఆదిత్య ధర్ సినిమా ధురంధర్ 47వ రోజు రూ.1.50 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా ఇండియా బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ.828.10 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ సినిమా రూ.1325.64 కోట్లు సంపాదించింది. ఇప్పుడు దీని రెండో భాగం ధూరందర్ 2 మార్చి 19న విడుదల కానుంది.
ప్రభాస్ సినిమా ది రాజా సాబ్ పరిస్థితి బాక్సాఫీస్ వద్ద చాలా దారుణంగా ఉంది. డైరెక్టర్ మారుతి సినిమాను మొదటి రోజే ప్రేక్షకులు తిరస్కరించారు. సినిమా విడుదలై 12 రోజులైంది. 12వ రోజు సినిమా వసూళ్లు కోట్ల నుంచి లక్షలకు పడిపోయాయి. ఈ సినిమా తాజాగా 73 లక్షలు వసూలు చేసింది. ఇండియాలో రూ.141.43 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.216 కోట్లు వసూలు చేసింది.
56
70 ఏళ్ల వయసులో చిరంజీవి దూకుడు
జనవరి 12న విడుదలైన 70 ఏళ్ల చిరంజీవి సినిమా మన శంకర వర ప్రసాద్ గారు అందరిపై ఆధిపత్యం చూపిస్తోంది. సినిమా విడుదలై 9 రోజులే అయినా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
66
మన శంకర వర ప్రసాద్ గారు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ?
మన శంకర వర ప్రసాద్ గారు సినిమా 9వ రోజు రూ.5.75 కోట్లు వసూలు చేసింది. sacnilk.com ప్రకారం, ఇండియాలో ఈ సినిమా నెట్ కలెక్షన్ రూ.171.65 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా రూ.240 కోట్లు సంపాదించింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్ రూ.203.85 కోట్లుగా ఉంది. ప్రభాస్ కు షాక్ ఇస్తూ.. చిరంజీవి తన సినిమాతో దూసుకుపోతున్నాడు.