బిగ్ బాస్ (Biggboss 9 Telugu) అంటేనే మోసం చేసి గెలవడం. అక్కడ స్నేహం అనేది ఒక భ్రమ. ఎవరి అవసరానికి వారిని వాడుకుని ఆటలో ముందుకు సాగడమే అసలైన గేమ్. ఈ విషయంలో రీతూ చౌదరి అందరినీ మించి పోయింది. డిమోన్ పవన్ తో కలిసి కళ్యాణ్ ను ఆట నుంచి బయటికి తోసింది.
బిగ్ బాస్ హౌస్ మొదటి రోజు నుంచి రసవత్తరంగా మొదలైంది. ఎప్పుడూ మొదటి వారం రోజులు కూల్ గా ఉండే హౌస్.. ఈ కంటెస్టెంట్‌లా ఓవరాక్షన్ వల్ల మొదటి నుంచే తగువులతో, గొడవలతో, అరుపులతో సాగుతూ వస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్సీ రేస్ జరుగుతోంది. దీనికి సంబంధించిన తాజా ప్రోమో విడుదల అయింది. దీనిలో రీతూ చౌదరి, డిమోన్ పవన్ కలిసి సోల్జర్ కళ్యాణ్ ను చావు దెబ్బ కొట్టారు. అతడిని కెప్టెన్సీ కంటెండెర్ కాకుండా తీసిపారేశారు.
25
కళ్యాణ్ ని వాడేస్తున్న రీతూ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇంట్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి ప్రతివారం ఏదో ఒక చర్చ వస్తూనే ఉంటుంది. అందులో రీతు చౌదరి, కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్ చుట్టూనే ఈ లవ్ స్టోరీ తిరుగుతోంది. కళ్యాణ్ ఇంట్లో ఓదార్పు యాత్రను మొదటి వారం నుంచి కొనసాగిస్తూనే వచ్చాడు. రీతూ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. అవసరం వచ్చినప్పుడల్లా కళ్యాణ్ పడాలని వాడేస్తూనే ఉంది రీతూ. మరోపక్క డిమోన్ పవన్ అంటే ఇష్టమని చెబుతూనే ఉంది. అయితే ఈసారి సోల్జర్ కు గట్టి షాకే ఇచ్చారు రీతూ, డిమోన్ కలిసి.
35
కెప్టెన్సీ పోటీ
కెప్టెన్సీ పోటీలో కళ్యాణ్, రాము, రీతు, ఇమ్మాన్యూయల్ ఉన్నారు. వీరికి రెయిన్ డాన్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. డ్యాన్స్ ఎవరైతే చేస్తారో వారి చేతిలోనే కెప్టెన్సీ కంటెండర్ గా ఎవరు ఉండాలో తేల్చాలన్న నియమం పెట్టాడు. రీతూ చుట్టూ తిరుగుతున్న డిమోన్ పవన్.. రీతూ చెప్పినట్టే కళ్యాణ్ పడాలని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించేశాడు. ఇది కళ్యాణ్ కు గొప్ప షాకే తగిలింది.
ఆ తర్వాత కళ్యాణ్ తో డిమోన్ మాట్లాడుతూ రీతూ చెప్పింది కాబట్టే కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేసానని చెప్పేసాడు. ఆ తర్వాత రీతూ.. కళ్యాణ్ దగ్గరికి వెళ్లి సారీ అని చెప్పింది. దాంతో కళ్యాణ్ చాలా సీరియస్ గా ‘చెయ్ తియ్’ అన్నాడు. ఆ డైలాగు విన్న రీతూ ఆ కోపాన్ని చూసి షాకైంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్లో చూడాలి.
55
కెప్టెన్ రాము రాథోడ్
ఇక 24/7 బిగ్ బాస్ చూస్తున్నవారికి ఇప్పటికే రాము రాథోడ్ కెప్టెన్ కొత్త కెప్టెన్ గా ఎంపికైనట్టు తెలిసిపోయింది. కష్టపడి కళ్యాణ్ పడాలని కెప్టెన్సీరేస్ నుంచి తప్పించిన రీతూకి రాము నుంచి గట్టి పోటీయే ఎదురైంది. చివరికి సంచాలక్ గా ఉన్న భరణి.. రీతూని కాదని రాముకి కెప్టెన్ పదవిని ఇచ్చాడు. అందరికీ షాక్ ఇచ్చి రీతూకి భరణి గట్టి షాకే ఇచ్చాడని చెప్పుకోవాలి. ఇక కెప్టెన్ గా రాము ఆట తీరు ఎలా ఉంటుందో ఈ వారం తెలిసిపోతుంది.